ప్రియాంక పెద్ద మనసు


ప్రియాంక పెద్ద మనసు
Priyanka Gandhi

ప్రియాంక పెద్ద మనసు

ఢిల్లీ: ట్యూమర్ తో బాధ పడుతున్న పసి పాపకు సాయం చేసి కాంగ్రెస్‌ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ తన పెద్ద మనసును చాటుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆ రెండున్నర సంవత్సరాల పాపను చికిత్స కోసం తన విమానంలో ఢిల్లీ లోని ఎయిమ్స్ కు తరలించారు.

అంతకు ముందు ఆ పాపను చికిత్స కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్ రాజ్‌లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలో చేర్చారు.  ఆమెను పరీక్షించిన డాక్టర్లు  పరిస్థితి విషమంగా ఉందని, బతకడం కష్టమని  తేల్చి చెప్పారు. ఆ  సమయంలో  ప్రయాగ్‌ రాజ్‌లో ప్రచారం నిర్వహిస్తోన్న కాంగ్రెస్‌ నేత రాజీవ్ శుక్లా ఈ విషయాన్ని ప్రియాంక దృష్టికి తీసికెళ్ళారు.

వెంటనే స్పందించిన ఆమె తన  ప్రైవేటు విమానంలో ఆ బాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యులను దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించడానికి సహకరించారు. వారికి సాయంగా ఉండేందుకు కాంగ్రెస్‌నేత అజరుద్దీన్‌ను ఆ విమానంలోనే పంపారు.

ప్రియాంక పెద్ద మనసు | actioncutok.com

Trending now: