ప‌బ్‌లో ప్ర‌భాస్ చిందులు


ప‌బ్‌లో ప్ర‌భాస్ చిందులు

ప‌బ్‌లో ప్ర‌భాస్ చిందులు

ప్ర‌భాస్ అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సాహో’.  భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే చారిత్రాత్మ‌క విజ‌యం సాధించిన ‘బాహుబ‌లి 2 – ది కంక్లూజ‌న్‌’ త‌రువాత ప్ర‌భాస్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌పై భారీ అంచ‌నాలే ఉన్నాయి.  చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని.. ఆగ‌స్టు 15న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ఓ క‌ల‌ర్‌ఫుల్ సాంగ్‌ను అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వేస్తున్న‌ రిచ్ ప‌బ్ సెట్‌లో చిత్రీక‌రించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సెట్‌కి సంబంధించిన నిర్మాణం జ‌రుగుతోంది. దాదాపు ఐదు రోజుల పాటు సాగే ఈ గీతంలో ప్రభాస్ స్టెప్పులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని స‌మాచారం.

ప్ర‌భాస్‌కి జోడీగా శ్ర‌ద్ధా క‌పూర్ న‌టిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ప‌బ్‌లో ప్ర‌భాస్ చిందులు | actioncutok.com

More for you: