పూరి ముద్ర కనిపిస్తుందా?


పూరి ముద్ర కనిపిస్తుందా?

పూరి ముద్ర కనిపిస్తుందా?

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనదైన ముద్రను కోల్పోతూ వస్తున్నాడా? జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన ‘టెంపర్’ ఆయన చివరి హిట్ ఫిల్మ్. అది 2015లో వచ్చింది. ఆ తర్వాత ‘జ్యోతిలక్ష్మి’ మొదలుకొని ‘మెహబూబా’ వరకు ఆరు సినిమాలు చేసినా సరైన విజయం దక్కలేదు. గతంలో ఎప్పుడూ పూరికి ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు.

అదివరకు ఆయనతో సినిమాలు చేసి సూపర్ స్టార్ అనిపించుకున్న వాళ్లు సైతం ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. ఈ నేపథ్యంలో కసిగా ‘ఇస్మార్ట్ శంకర్’ రూపొందిస్తున్నాడు పూరి. ఇందులో తొలిసారిగా రాంను డైరెక్ట్ చేస్తున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టి తనలో మునుపటి ముద్ర అలాగే ఉందనీ, దర్శకుడిగా తనలో సత్తా ఏమీ తగ్గలేదనీ నిరూపించుకోవాలనే పట్టుదల ఆయనలో కనిపిస్తోంది.

దర్శకుడిగా ‘ఇస్మార్ట్ శంకర్’ పూరికి 35వ చిత్రం. ఇప్పటి టాప్ డైరెక్టర్లలో 19 ఏళ్ల కాలంలో ఇన్ని సినిమాలు రూపొందించింది పూరీనే. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత టాప్ హీరోలు మళ్లీ ఆయనతో సినిమాలు చెయ్యడానికి ముందుకొస్తారేమో చూడాలి.

పూరి ముద్ర కనిపిస్తుందా? | actioncutok.com

Trending now: