Puri Suffers Colossal Damage By Cyclone Fani


Puri Suffers Colossal Damage By Cyclone Fani

Famous pilgrimage Puri’s condition has become worse by the cyclone Fani.

ఫాని తుఫానుతో అల్లాడుతున్న పూరి క్షేత్రం

ఫాని తుఫాను ధాటికి ప్రసిద్ధ పుణ్య క్షేత్రం పూరి పరిస్థితి దారుణంగా మారింది. మొన్నటి దాకా పర్యాటకులకు స్వాగతం పలికిన పూరి ఇప్పుడు కళావిహీనంగా తయారైంది. అందంగా కనిపించే పూరిధాం వికారంగా తయారయింది. ఎటు చూసినా కూలిన బిల్డింగులు, విరిగిపడిన చెట్లు, కుప్పకూలిన సెల్ టవర్లు, దెబ్బతిన్న రోడ్లు.. ఇవే కనిపిస్తున్నాయి.

సెల్ టవర్ విరిగి పడటం వల్ల ఒక మారుతు సుజుకి షోరూంలోని పలు కార్లు ధ్వంసమయ్యాయి. షెడ్డులోని రూఫ్‌కు ఉపయోగించిన రేకులన్నీ లేచిపోవడాన్ని బట్టి తుఫాను తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సెల్‌టవర్లు విరిగిపోవడమో, దెబ్బతినడమో జరగడంతో అనేక ప్రాంతాల్లో నెట్‌వర్కులు పనిచేయక జనం ఇబ్బంది పడుతున్నారు. కరంటు స్తంభాలు కూలడంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరా స్తంభించింది. పలు దుకాణాలు ధ్వంసమైపోవడంతో భారీగా నష్టపోయిన వ్యాపారులు విలవిల లాడుతున్నారు.

మొత్తానికి ఫోనీ ధాటికి పూరి అస్తవ్యస్తంగా తయారయింది. పలు ప్రాంతాల్లో నీటి సరఫరా లేక అల్లాడుతున్నామని జనం చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలో పాలుపోక కూలిన ఇళ్లు, ఎగిసిపోయిన పైకప్పులు చూసుకుంటూ జనం కలత చెందుతున్నారు. తమను ఆదుకొనే వారికోసం ఎదురు చూస్తున్నారు.

Puri Suffers Colossal Damage By Cyclone Fani | actioncutok.com

Trending now: