అలియా భ‌ట్.. క్వాడ్రపుల్ ఛీర్స్‌!


అలియా భ‌ట్.. క్వాడ్రపుల్ ఛీర్స్‌!

అలియా భ‌ట్.. క్వాడ్రపుల్ ఛీర్స్‌!

భార‌తీయ కుర్ర‌కారుకి కునుకు లేకుండా చేస్తున్న అందం.. అలియా భ‌ట్‌. దాదాపు ఏడేళ్ళుగా హిందీ నాట క‌థానాయిక‌గా రాణిస్తున్న ఈ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ.. ఇప్పుడు చేతినిండా సినిమాల‌తో ఫుల్‌ బిజీగా ఉంది. ఇంకా చెప్పాలంటే.. ‘కేరాఫ్ క్రేజీ ప్రాజెక్ట్స్‌’ అన్న‌ట్లుగా త‌న career సాగుతోం ది ఇప్పుడు.  య‌న్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి రూపొందిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్‌’తో పాటు ‘బ్ర‌హ్మాస్త్ర‌’, ‘స‌డ‌క్ 2’, ‘ఇన్షా అల్లా’.. ఇలా భారీ చిత్రాలే ఉన్నాయి అలియా ఖాతాలో. అంతేకాదు.. ఈ నాలుగు చిత్రాలు కూడా వ‌చ్చే ఏడాదిలోనే తెర‌పైకి రాబోతున్నాయి.

ర‌ణ్‌బీర్‌క‌పూర్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, నాగార్జున‌.. ఇలా భారీ తారాగ‌ణంతో రూపొందుతున్న ‘బ్ర‌హ్మాస్త్ర‌’ 2020 వేస‌వికి రిలీజ్ కాబోతుండ‌గా.. మిగిలిన మూడు చిత్రాలు జూలై నెల‌లో విడుద‌ల కాబోతున్నాయి.  ఆమె తండ్రి మ‌హేశ్ భ‌ట్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ‘స‌డ‌క్ 2’ (1991 నాటి ‘స‌డ‌క్‌’కి సీక్వెల్‌) 2020 జూలై 10న release కానుండ‌గా.. ‘ఆర్ ఆర్ ఆర్‌’ జూలై 30న విడుద‌ల కానుంది. ఇక స‌ల్మాన్ ఖాన్‌, సంజ‌య్ లీలా భ‌న్సాలీ కాంబినేష‌న్‌లో రానున్న ‘ఇన్షా అల్లా’ కూడా అదే జూలైలో రాబోతోందట‌.  సో.. వ‌చ్చే ఏడాది జూలైలో అలియా త‌న ఫ్యాన్స్‌కి quadruple cheers చెప్ప‌బోతోంద‌న్న‌మాట‌.

అలియా భ‌ట్.. క్వాడ్రపుల్ ఛీర్స్‌! | actioncutok.com

More for you: