ర‌ష్మిక క్రేజే వేర‌ప్పా!


ర‌ష్మిక క్రేజే వేర‌ప్పా!
Rashmika Mandanna

ర‌ష్మిక క్రేజే వేర‌ప్పా!

‘ఛ‌లో’, ‘గీత గోవిందం’ చిత్రాల‌తో తెలుగునాట‌ వ‌రుస విజ‌యాల‌ను అందుకుంది క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న‌. ఆ త‌రువాత ‘దేవ‌దాస్‌’లో మెరిసిన ఈ టాలెంటెడ్ బ్యూటీకి.. స‌ద‌రు చిత్రం హ్యాట్రిక్ స‌క్సెస్‌ని ఇవ్వ‌లేక‌పోయింది. అయిన‌ప్ప‌టికీ టాలీవుడ్‌లో వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతోంది ర‌ష్మిక‌.

ఒక వైపు  త‌న తాజా చిత్రం ‘డియ‌ర్ కామ్రేడ్‌’ జూలై 26న విడుద‌లకు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. మ‌రో వైపు కొత్త చిత్రాల‌కు సంత‌కాలు చేసే ప‌నిలో బిజీగా ఉంది ర‌ష్మిక‌. ఇప్ప‌టికే నితిన్ ‘భీష్మ‌’లో హీరోయిన్‌గా న‌టిస్తున్న ర‌ష్మిక‌.. ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్ళేలోపే రెండు భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిందని స‌మాచారం.

ఆల్రెడీ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్ మూవీలో హీరోయిన్‌గా ఎంపికైన ర‌ష్మిక‌.. మ‌హేశ్ బాబు – అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్‌లోనూ నాయిక‌గా న‌టించే ఛాన్స్ కొట్టేసింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

తెలుగులోనే కాదు.. త‌మిళ‌, క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌ల్లోనూ త‌న హ‌వా సాగిస్తోందీ అమ్మ‌డు. త‌న మాతృభాష క‌న్న‌డ‌లో రెండు చిత్రాలు చేస్తున్న ర‌ష్మిక‌.. త‌మిళంలో కార్తి హీరోగా న‌టిస్తున్న సినిమాతో పాటు  కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ క‌థానాయ‌కుడిగా లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న సినిమాలోనూ నాయిక‌గా ఎంపికైంద‌ని స‌మాచారం.

మొత్త‌మ్మీద‌.. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ ఇలా మూడు భాష‌ల్లో ర‌ష్మిక దూసుకుపోతున్న తీరు చూసి.. ర‌ష్మిక క్రేజే వేర‌ప్పా అనుకుంటూ ఆమె అభిమానులు మురిసిపోతున్నారు.

ర‌ష్మిక క్రేజే వేర‌ప్పా! | actioncutok.com

More for you: