‘మ‌హా సముద్రం’లో దూకనున్న మాస్ మహారాజా?


నలుగురు యువ హీరోల తర్వాత అజయ్ భూపతి రెండో సినిమా ‘మహా సముద్రం’లో హీరోగా ప్రస్తుతం రవితేజ పేరు వినిపిస్తోంది.

'మ‌హా సముద్రం'లో దూకనున్న మాస్ మహారాజా?
Ravi Teja

‘మ‌హా సముద్రం’లో దూకనున్న మాస్ మహారాజా?

ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌చిన క‌థానాయ‌కుడు ర‌వితేజ‌. ఏడాదికో విజ‌యంతో మినిమ‌మ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న ఈ మాస్ మ‌హారాజా.. ఆ మ‌ధ్య కాస్త ట్రాక్ త‌ప్పాడు. అయితే.. ‘రాజా ది గ్రేట్‌’ రూపంలో మ‌ళ్ళీ విజ‌యం ద‌క్క‌డంతో.. ఊపిరి పీల్చుకున్నాడు.  ఆ త‌రువాత ‘ట‌చ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్టు’, ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని’ రూపంలో బ్యాక్ టు బ్యాక్ డిజాస్ట‌ర్స్ వెంటాడ‌డంతో.. ఆ ఆనందం ఇట్టే నిల‌వ‌లేదు.

ఈ నేప‌థ్యంలో.. ప్ర‌స్తుతం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రానున్న‌ ‘డిస్కో రాజా’ పైనే ఆశ‌లు పెట్టుకున్నాడు ర‌వితేజ‌. పిరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా.. ఈ నెల 27 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ లోపే.. మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పాడ‌ట ర‌వితేజ‌. అది కూడా.. న‌లుగురైదుగురి యువ క‌థానాయ‌కుల పేర్లు వినిపించినా వ‌ర్క‌వుట్ కాని సినిమా కావ‌డం విశేషం.

ఇంత‌కీ ఆ చిత్రం ఏంటంటే.. ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ అజ‌య్ భూప‌తి సెకండ్ వెంచ‌ర్ ‘మహా స‌ముద్రం’. రామ్‌, నితిన్‌, బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, నాగ‌చైత‌న్య‌.. ఇలా చెప్పుకోద‌గ్గ ఈ యంగ్ హీరోల‌ లిస్టే ఈ సినిమా విష‌యంలో వినిపించింది. అయితే… చివ‌రాఖ‌రికి ఈ ప్రాజెక్ట్ ర‌వితేజ చెంత‌కు చేరింద‌ని లేటెస్ట్ టాక్‌. మ‌రి.. ర‌వితేజ‌తోనైనా ఈ ప్రాజెక్ట్ వ‌ర్క‌వుట్ అవుతుందో లేదంటే మ‌ళ్ళీ చేతులు మారుతుందో చూడాలి. 

‘మ‌హా సముద్రం’లో దూకనున్న మాస్ మహారాజా? | actioncutok.com

Trending now: