జల క్రీడల్లో.. ‘సైరా’!


జల క్రీడల్లో.. 'సైరా'!

జల క్రీడల్లో.. ‘సైరా’!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో తొలి తెలుగు స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు చిరు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమాకి సంబంధించి.. ప్ర‌స్తుతం పాట చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.  అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో జ‌ల‌పాతాలు, పూల‌వ‌నాన్ని త‌ల‌పిస్తూ ప్ర‌త్యేకంగా వేసిన సెట్‌లో..  శేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్య‌ద‌ర్శ‌క‌త్వంలో చిరు, న‌య‌న‌తార‌పై  ఈ రొమాంటిక్ సాంగ్‌ని చిత్రీక‌రిస్తున్నార‌ని తెలిసింది.

అనంత‌రం.. కోకాపేట్‌లో వేసిన స్పెష‌ల్ సెట్‌లో కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌డంతో సినిమా పూర్త‌వుతుంద‌ని టాక్‌.  ఆపై విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, పోస్ట్ ప్రొడక్ష‌న్ వ‌ర్క్‌పై దృష్టి సారించి.. అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ‘సైరా ‘ని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

మరి.. భారీ అంచ‌నాల‌తో వ‌స్తున్న ‘సైరా’.. చిరు గ‌త చిత్రం ‘ఖైదీ నంబ‌ర్ 150’ని మించి బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందేమో చూద్దాం.

జల క్రీడల్లో.. ‘సైరా’! | actioncutok.com

Trending now: