‘ఆర్ ఆర్ ఆర్‌’.. మ‌ళ్ళీ షురూ!


'ఆర్ ఆర్ ఆర్‌'.. మ‌ళ్ళీ షురూ!

‘ఆర్ ఆర్ ఆర్‌’.. మ‌ళ్ళీ షురూ!

‘బాహుబ‌లి’ సిరీస్‌తో తెలుగు సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్ళిన స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ య‌స్‌.య‌స్‌.రాజ‌మౌళి.. ప్ర‌స్తుతం ‘ఆర్ ఆర్ ఆర్‌’తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. య‌న్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో సిస‌లైన మ‌ల్టిస్టార‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా.. ఇప్ప‌టికే కొంత‌మేర చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. అయితే.. అనూహ్యంగా తార‌క్‌, చ‌ర‌ణ్ గాయాల‌పాలు కావ‌డంతో.. షూటింగ్‌కి బ్రేక్ ప‌డింది. ఇప్పుడు ఈ ఇద్ద‌రూ కూడా గాయాల నుండి కోలుకున్నారని స‌మాచారం.

లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే.. ఈ నెల 21 నుంచి ఈ సినిమాకు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కానుంద‌ని తెలిసింది. అంతేకాదు..  అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ప్ర‌త్యేకంగా వేసిన సెట్‌లో జ‌రిగే ఈ షెడ్యూల్‌లో చిత్ర క‌థానాయిక‌ల్లో ఒక‌రైన అలియా భ‌ట్ కూడా జాయిన్ కానుంద‌ని స‌మాచారం. 

అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్‌, కొమ‌రం భీమ్‌గా తార‌క్ న‌టిస్తున్న ఈ సినిమాకి కీర‌వాణి సంగీత‌మందిస్తున్నాడు.  2020 జూలై 30న ఈ సినిమా రిలీజ్ కానుంది. ప‌లు భాష‌ల్లో విడుద‌ల కానున్న ‘ఆర్ ఆర్ ఆర్‌’ భారీ విజ‌యం సాధిస్తే.. తెలుగునాట మ‌రిన్ని మ‌ల్టిస్టార‌ర్ మూవీస్ ప‌ట్టాలెక్కే అవ‌కాశ‌ముంది.

‘ఆర్ ఆర్ ఆర్‌’.. మ‌ళ్ళీ షురూ! | actioncutok.com

More for you: