‘మహర్షి’కి US లో నష్టాలు ఖాయం!


'మహర్షి'కి US లో నష్టాలు ఖాయం!

‘మహర్షి’కి US లో నష్టాలు ఖాయం!

మహేశ్ కెరీర్‌కు milestone లాంటి సినిమా అంటూ ఊదరగొట్టిన ‘మహర్షి’ సినిమా, అతనికి బలమైన ప్రాంతమైన US లోనే భారీ నష్టాల్ని తీసుకు రావడం దాదాపు ఖాయమైంది. 2.5 మిలియన్ డాలర్లను వసూలు చేస్తేనే గిట్టుబాటయ్యే ఆ సినిమా కనీసం 2 మిలియన్ డాలర్లను కూడా వసూలు చేయడం ఆసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ US లో ‘మహర్షి’ 1.83 మిలియన్ డాలర్లను మాత్రమే రాబట్టింది.

నైజాం, ఆంధ్రా ప్రాంతాల్లో లాభాలను గడిస్తున్న మహేశ్ సినిమా అమెరికాలోని తెలుగువాళ్లను ఆశించిన రీతిలో మెప్పించలేకపోయిందనడానికి ఈ వసూళ్లే నిదర్శనం. అక్కడి మహేశ్ fans సైతం second half ను డైరెక్టర్ తీర్చిదిద్దిన విధానం చూసి పెదవి విరిచారు. climax బాగుండటంతో ఆ మాత్రం collections అయినా వచ్చాయని చెబ్తున్నారు.

నిర్మాత దిల్ రాజు, US డిస్ట్రిబ్యూటర్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం లాభాలైనా, నష్టాలైనా చెరి సగం పంచుకోవాలి. దానికి తగ్గట్లు సుమారు రూ. 2 కోట్ల నష్టంలో దిల్ రాజు రూ. కోటి భరించాల్సి ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు చెబ్తున్నారు.

‘మహర్షి’కి US లో నష్టాలు ఖాయం! | actioncutok.com

More for you: