ప్ర‌భాస్‌కి త‌ప్ప‌ని పోటీ


ప్ర‌భాస్‌కి త‌ప్ప‌ని పోటీ

ప్ర‌భాస్‌కి త‌ప్ప‌ని పోటీ

‘సాహో’.. ప్ర‌భాస్ న‌టిస్తున్న తొలి త్రిభాషా చిత్రం. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌.. తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో ఆగ‌స్టు 15న రిలీజ్ కాబోతోంది. తెలుగులో ఈ సినిమాకి పోటీగా ఆ రోజున‌ మ‌రే చిత్రం రిలీజ్   కావ‌డం లేదు. కానీ.. హిందీలో మాత్రం ప్ర‌భాస్‌కి పోటీ త‌ప్ప‌డం లేదు. ఎందుకంటే.. అదే పంద్రాగ‌స్టున రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి.

అందులో ఒక‌టి.. అక్ష‌య్ కుమార్‌, విద్యా బాల‌న్‌, నిత్య మీన‌న్‌, సోనాక్షి సిన్హా, తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ‘మిష‌న్ మంగ‌ళ్‌’ కాగా.. మ‌రొక‌టి జాన్ అబ్ర‌హాం ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ‘బాట్లా హౌస్‌’.  సాధార‌ణంగా.. ఒకే రోజున మూడు చిత్రాలు రిలీజ‌వుతున్నాయంటే క‌చ్చితంగా అది వ‌సూళ్ళ‌పై ప్ర‌భావం చూపిస్తుంది.

మ‌రి.. ‘బాహుబ‌లి’ సిరీస్‌తో ఉత్త‌రాదిన సెప‌రేట్ ఫ్యాన్ బేస్‌ని సంపాదించుకున్న ప్ర‌భాస్.. ఈ పోటీని త‌ట్టుకుని విజ‌య‌తీరాల‌కు చేరుతాడో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

ప్ర‌భాస్‌కి త‌ప్ప‌ని పోటీ | actioncutok.com

More for you: