రంజాన్‌కు ‘సాహో’ టీజర్


రంజాన్‌కు 'సాహో' టీజర్

రంజాన్‌కు ‘సాహో’ టీజర్

ప్రభాస్ అభిమానులకు శుభవార్త. ‘సాహో’ సినిమా టీజర్ రంజాన్ పండుగ సందర్భంగా జూన్ 5న బయటకు వస్తుందని సమాచారం. శ్రద్ధా కపూర్ నాయికగా నటిస్తోన్న ఈ సినిమాని సుజీత్ direct చేస్తున్నాడు. యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తోంది.

నీల్ నితిన్ ముఖేశ్ మెయిన్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో అరుణ్ విజయ్, ఎవ్లీన్ శర్మ, మందిరా బేడి, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మహేశ్ మంజ్రేకర్, స్రవంతి చటర్జీ, వెన్నెల కిశోర్ కీలక పాత్రధారులు. ఆర్. మది సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, అక్కినేని శ్రీకరప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

కాగా సంగీత దర్శక త్రయం శంకర్-ఎహ్‌సాన్-లాయ్  సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఒక్కో పాటను ఒక్కో సంగీత దర్శకుడితో compose చేయించాలని డైరెక్టర్ సుజీత్ భావించడం వల్లే వాళ్లు తప్పుకున్నారు. ఒక పాటను తమిళ సంగీత దర్శకుడు జిబ్రాన్ compose చేస్తున్నట్లు సమాచారం.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తయారవుతున్న ‘సాహో’లో ప్రభాస్ చేసే ఫైట్లు, ఫీట్లు మాస్ ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటాయని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్ట్ 15న విడుదల కానున్నది.

రంజాన్‌కు ‘సాహో’ టీజర్ | actioncutok.com

More for you: