‘ఆర్ ఆర్ ఆర్‌’లో ‘ఫిదా’ భామ‌?


'ఆర్ ఆర్ ఆర్‌'లో 'ఫిదా' భామ‌?

‘ఆర్ ఆర్ ఆర్‌’లో ‘ఫిదా’ భామ‌?

శేఖ‌ర్ క‌మ్ముల ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఫిదా’తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది సాయిప‌ల్ల‌వి. మొద‌టి తెలుగు చిత్రంతోనే సెన్సేష‌న్ create చేసిన ఈ ముద్దుగుమ్మ‌.. ఆ త‌రువాత ‘ఎంసీఏ’తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్‌ని అందుకుంది. అయితే… ఆ త‌రువాత మాత్రం సాయిప‌ల్ల‌వికి  వ‌రుస ప‌రాజ‌యాలే ఎదుర‌య్యాయి.

‘క‌ణం’, ‘ప‌డి ప‌డి లేచె మ‌న‌సు’ రూపంలో back to back డిజాస్ట‌ర్స్ చ‌విచూసింది ప‌ల్ల‌వి. అలాగే త‌మిళ అనువాద చిత్రం ‘మారి 2’ కూడా డిజ‌ప్పాయింట్ చేసింది. ఈ నేప‌థ్యంలో.. ఈరోజు విడుద‌లైన‌ మ‌రో త‌మిళ అనువాద చిత్రం ‘ఎన్జీకే’ పైనే త‌న ఆశ‌ల‌ను పెట్టుకుంది సాయిప‌ల్ల‌వి.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం సాయిప‌ల్ల‌వి ‘నీదీ నాదీ ఒకే క‌థ‌’ ఫేమ్‌ వేణు ఊడుగుల రూపొందిస్తున్న ‘విరాట‌పర్వం 1992లో న‌టిస్తోంది. అంతేకాదు..  దీంతో పాటు ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లోనూ న‌టించబోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ సినిమా మ‌రేదో కాదు.. రాజ‌మౌళి రూపొందిస్తున్న massive మ‌ల్టీస్టార‌ర్ ‘ఆర్ ఆర్ ఆర్‌’. య‌న్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌ క‌థానాయిక‌గా అలియా భ‌ట్ న‌టిస్తుండ‌గా… తార‌క్ స‌ర‌స‌న ఓ విదేశీ భామ న‌టించ‌బోతోంది.

కాగా ఓ కీల‌క పాత్ర కోసం సాయిప‌ల్ల‌వితో సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. అదే గ‌నుక నిజ‌మైతే సాయిపల్ల‌వి అభిమానుల‌కు ఇది శుభ‌వార్తే. త్వ‌ర‌లోనే సాయిపల్ల‌వి ఎంట్రీపై clarity రానుంది.

‘ఆర్ ఆర్ ఆర్‌’లో ‘ఫిదా’ భామ‌? | actioncutok.com

More for you: