సాయితేజ్‌కి ఈ సారైనా క‌లిసొస్తాడా?


సాయితేజ్‌కి ఈ సారైనా క‌లిసొస్తాడా?
Thaman

సాయితేజ్‌కి ఈ సారైనా క‌లిసొస్తాడా?

‘చిత్ర‌ల‌హ‌రి’ విజ‌యం మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్‌లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నేప‌థ్యంలో.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని యూత్‌ఫుల్ సినిమాల‌ స్పెష‌లిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్‌లో క‌మిట్ అయ్యాడు తేజ్‌.  ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్‌, యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తాయ‌ని టాక్‌.

అంతేకాదు.. ఈ చిత్రానికి యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎంపిక‌య్యాడని తెలిసింది.
అయితే.. ప్ర‌స్తుతం త‌మ‌న్ ట్రాక్ రికార్డు బాగానే ఉన్నా.. సాయితేజ్ కాంబినేష‌న్‌లో మాత్రం అత‌గాడికి స‌రైన విజ‌యాలు లేవు. ‘తిక్క‌’, ‘విన్న‌ర్‌’, ‘జ‌వాన్‌’, ‘ఇంటిలిజెంట్‌’.. ఇలా సాయితేజ్‌, త‌మ‌న్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన నాలుగు చిత్రాలూ బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిల‌ప‌డ్డాయి.

ఈ నేప‌థ్యంలో.. ఐదోసారి జ‌ట్టుక‌డుతున్న ఈ ఇద్ద‌రికీ  ఈ సారైనా స‌క్సెస్ ద‌క్కుతుందేమో చూద్దాం.
తాత‌, తండ్రి, మ‌న‌వ‌డు… ఇలా మూడు త‌రాల చుట్టూ తిరిగే క‌థ‌తో సాయితేజ్‌, మారుతి కాంబినేష‌న్ ఫిల్మ్ తెర‌కెక్క‌నుంది. సాయితేజ్‌కి తండ్రిగా రావు ర‌మేష్ న‌టించే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా వెల్ల‌డి కానున్నాయి.

సాయితేజ్‌కి ఈ సారైనా క‌లిసొస్తాడా?  | actioncutok.com

Trending now: