ప్ర‌భాస్‌కి స‌ల్మాన్ గెస్ట్ కాద‌ట‌!


ప్ర‌భాస్‌కి స‌ల్మాన్ గెస్ట్ కాద‌ట‌!

ప్ర‌భాస్‌కి స‌ల్మాన్ గెస్ట్ కాద‌ట‌!

‘బాహుబ‌లి’ సిరీస్ త‌రువాత ప్ర‌భాస్ ఉత్త‌రాది వారికి కూడా డార్లింగ్ అయిపోయాడు. అందుకే ‘సాహో’లో ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించేందుకు వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ముఖ్యంగా.. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న అందాల తార శ్ర‌ద్ధా క‌పూర్ ‘సాహో’లో హీరోయిన్‌గా న‌టించ‌డం వార్త‌ల్లో నిలిచింది. అప్ప‌టివ‌ర‌కు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ వైపు దృష్టి సారించ‌ని శ్ర‌ద్ధ‌.. ‘సాహో’కి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం వెనుక.. ‘బాహుబ‌లి’ ప్ర‌ధాన కార‌ణంగా నిలిచింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి గ‌త కొద్ది రోజులుగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేమిటంటే.. బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని. అయితే.. ఆ క‌థ‌నాల్లో ఎలాంటి నిజం లేద‌ని చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ స్ప‌ష్టం చేశాడు.

‘సాహో’లో స‌ల్మాన్ గెస్ట్ రోల్‌పై వ‌చ్చిన వార్త‌లన్నీ నిరాధారమేన‌ని ఓ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తేల్చిచెప్పాడు సుజీత్‌.  సో.. ప్ర‌భాస్‌, స‌ల్మాన్‌ని ఒకే ఫ్రేమ్‌లో చూడాలనుకునేవారి కోరిక తీర‌న‌ట్లేన‌న్న‌మాట‌. భ‌విష్య‌త్‌లోనైనా ఈ ఇద్ద‌రూ క‌ల‌సి న‌టిస్తారేమో చూద్దాం.

కాగా..  ‘సాహో’ ఆగ‌స్టు 15న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ప్ర‌భాస్‌కి స‌ల్మాన్ గెస్ట్ కాద‌ట‌! | actioncutok.com

More for you: