అప్పుడు ‘పోకిరి’.. ఇప్పుడు ‘మహర్షి’?


అప్పుడు 'పోకిరి'.. ఇప్పుడు 'మహర్షి'?
Salman Khan

అప్పుడు ‘పోకిరి’.. ఇప్పుడు ‘మహర్షి’?

మహేశ్ టైటిల్ రోల్ పోషించిన ‘మహర్షి’ ఒకట్రెండు ఏరియాలు మినహా అన్ని ఏరియాల్లోనూ రెండో వారంలోనూ మంచి వసూళ్లను సాధిస్తున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి రూపొందించిన ఈ సినిమాలో వీకెండ్ ఫార్మింగ్ అనేది హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఈ సినిమాని బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు ప్రత్యేకంగా చూపించేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టేందుకు యత్నిస్తోన్న రాజు, అన్నీ కుదిరితే ‘మహర్షి’ని హిందీలో తానే నిర్మించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్ ‘దబాంగ్ 3’ని ప్రభుదేవా డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ముంబైలో రాజు ఏర్పాటు చేయనున్న స్పెషల్ స్క్రీనింగ్‌ను సల్మాన్‌తో పాటు ప్రభుదేవా కూడా చూడనున్నట్లు సమాచారం.

సందర్భవశాత్తూ గతంలో మహేశ్ సినిమా ‘పోకిరి’ రీమేక్ ‘వాంటెడ్’ను ప్రభుదేవా దర్శకత్వంలోనే సల్మాన్ చేసిన విషయం ప్రస్తావనార్హం. కాగా ‘మహర్షి’ని తమిళంలోనూ రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

అప్పుడు ‘పోకిరి’.. ఇప్పుడు ‘మహర్షి’? | actioncutok.com

More for you: