మహిళలూ.. మీకు జోహార్లు!


మహిళలూ.. మీకు జోహార్లు!

మహిళలూ.. మీకు జోహార్లు!

న్యూ ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన  తల్లులు, సోదరీమణులకు కాంగ్రెస్ అధ్యక్షుడు రా హుల్ వందనం  చేశారు. అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలవడంలో, భారీ  సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడంలో కీలక భూమిక పోషించిన మహిళలందరికీ అభివందనం చేస్తున్నట్టు రాహుల్ ఆదివారం ట్వీట్ చేశారు. 

లోక్‌సభ ఎన్నికల్లో చివరిదైన ఏడవ విడత పోలింగ్  ఆదివారం సాయంత్రం ముగిసింది. మహిళలందరూ తమ వాణి బలంగా వినిపించాలనే లక్ష్యంతో ఓటు వేస్తున్న అందరికీ అభివాదం తెలుపుతున్నానంటూ  ఆ ట్వీట్‌లో రాహుల్ పేర్కొన్నారు. తన ట్వీట్‌తో పాటు 30 సెకెండ్ల వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.

సమాన అవకాశాలు, గౌరవం, దేశ ఐక్యత కోరుతున్నట్టు మహిళా ఓటర్లు చెప్పుడం ఆ వీడియోలో కనిపిస్తుంది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ‘న్యాయ్’ స్కీమ్‌ తమకు ఎంతగానో ఉపకరిస్తుందన్న ఆశాభావాన్ని కూడా మహిళలు  వ్యక్తం చేశారు.  తుది విడతలో భాగంగా ఆదివారం దేశ వ్యాప్తంగా 59 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరిగింది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.

మహిళలూ.. మీకు జోహార్లు! | actioncutok.com