స్వింసూట్‌లో ‘మజిలీ’ జోడీ!


‘మజిలీ’ సినిమాతో జంటగా ఘన విజయం సాధించిన నాగచైతన్య, సమంత దంపతులు స్పెయిన్‌లో హాలిడేస్‌ను ఆస్వాదిస్తున్నారు.

స్వింసూట్‌లో 'మజిలీ' జోడీ!

స్వింసూట్‌లో ‘మజిలీ’ జోడీ!

నాగచైతన్య, సమంత దంపతులు ప్రస్తుతం స్పెయిన్‌లో హాలిడేస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్లినప్పట్నుంచీ ఆ జంట తమ ఆనంద క్షణాల్ని పంచుకుంటూ వస్తున్నారు. తాజాగా భర్త చైతన్యతో దిగిన సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రాం పేజీ ద్వారా షేర్ చేసింది సమంత.

ఆ ఫొటోలో బ్లాక్ స్వింసూట్‌లో సూపర్ హాట్‌గా కనిపిస్తోంది సమంత. చైతూ సైతం షర్ట్ లేకుండా సమంత పక్కనే సేద తీరుతూ కనిపిస్తున్నాడు. అన్నింటికంటే ఆ ఫొటోలో ఆకర్షిస్తోంది దానికి సమంత పెట్టిన క్యాప్షన్. “ఐ లవ్ యు 3000” అని చైతూ గురించి రాసింది. అది ‘అవెంజర్స్: ఎండ్‌గేం’లో ఐరన్ మేన్ కూతురు చెప్పే డైలాగ్ కావడం గమనార్హం.

కాగా తమ స్పెయిన్ హాలిడేస్‌లోని కొన్ని మధుర క్షణాల్ని సమంత, చైతన్య సోషల్ మీడియాలో పంచుకుంటూ వస్తున్నారు. వివాహానంతరం ఆ ఇద్దరూ తొలిసారి కలిసి నటించగా ఇటీవలే విడుదలైన ‘మజిలీ’ సినిమా ఘన విజయం సాధించింది. అందులో ఆ ఇద్దరి నటనకూ విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుని మంచి ప్రశంసలు లభించాయి.

స్వింసూట్‌లో ‘మజిలీ’ జోడీ! |actioncutok.com

Trending now: