నెల‌కో సినిమాతో సంద‌డి!


నెల‌కో సినిమాతో సంద‌డి!

నెల‌కో సినిమాతో సంద‌డి!

క‌థానాయిక‌గా entry ఇచ్చి ప‌దేళ్ళ‌వుతున్నా.. తెలుగునాట స‌మంత దూకుడు ఏ మాత్రం త‌గ్గలేదు. వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌తో ముందుకు సాగుతున్న ఈ talented beauty.. ఈ వేస‌వి ఆరంభంలో త‌న భ‌ర్త‌, యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి ‘మ‌జిలీ’లో సంద‌డి చేసింది. తెర‌పైనా భార్యాభ‌ర్త‌ల పాత్ర‌ల్లోనే క‌నిపించిన సామ్‌, చైతూకి.. ఈ చిత్రం ఘ‌న‌విజ‌యం అందించింది.

ఇదిలా ఉంటే.. స‌మంత ఈ ఏడాది ద్వితీయార్ధంలో మూడు చిత్రాల‌తో సంద‌డి చేయ‌నుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ఈ మూడు సినిమాలు కూడా వ‌రుస నెల‌ల్లో సంద‌డి చేయ‌నున్నాయి.  జూలై నెల‌లో సామ్ న‌టించిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ‘ఓ బేబీ’ విడుద‌ల కానుండ‌గా… ఆగ‌స్టు నెల‌లో త‌న మావ‌య్య నాగార్జున‌తో క‌ల‌సి నటిస్తున్న ‘మ‌న్మ‌థుడు 2′ (ఇందులో సామ్‌ది అతిథి పాత్ర‌) release కానుంది. ఇక సెప్టెంబ‌ర్ నెల‌లో ’96’ remake థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారం.

మ‌రి.. నెల‌కో సినిమాతో రాబోతున్న సామ్‌కి ఈ మూడు చిత్రాలు ఎలాంటి ఫ‌లితాల‌ను అందిస్తాయో చూడాలి.

నెల‌కో సినిమాతో సంద‌డి! | actioncutok.com

More for you: