‘మ‌న్మ‌థుడు 2’లో స‌మంత పాత్ర అదేనా?


'మ‌న్మ‌థుడు 2'లో స‌మంత పాత్ర అదేనా?
Samantha

‘మ‌న్మ‌థుడు 2’లో స‌మంత పాత్ర అదేనా?

‘మ‌న్మ‌థుడు’.. కింగ్ నాగార్జున కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రం. ఈ సినిమా త‌రువాత “మ‌న్మ‌థుడు అంటే నాగార్జున‌.. నాగార్జున అంటే మ‌న్మ‌థుడు” అన్నంత‌గా తెలుగునాట ఇమేజ్ సొంతం చేసుకున్నాడు నాగ్‌. అలాంటి ‘మ‌న్మ‌థుడు’ సినిమాకి.. ప‌దిహేడేళ్ళ త‌రువాత ఓ సీక్వెల్ రాబోతోంది. అదే.. ‘మ‌న్మ‌థుడు 2’.

రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నాగ్‌కి జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుండ‌గా.. బెంగ‌ళూరు బ్యూటీ అక్ష‌ర గౌడ ఓ అతిథి పాత్ర పోషిస్తోంది. అలాగే.. నాగ్ కోడ‌లు, అగ్ర క‌థానాయిక స‌మంత ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇందులో సామ్ పాత్ర‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది.

అదేమిటంటే.. ‘మ‌న్మ‌థుడు’లో అమ్మాయిలని క‌థానాయ‌కుడు ఎందుకు అస‌హ్యించుకుంటాడు? అనే విష‌యాన్ని హీరో బాబాయ్ పాత్ర‌ధారి త‌నికెళ్ళ భ‌ర‌ణితో చెప్పించిన‌ట్లే.. ‘మ‌న్మ‌థుడు 2’లో అమ్మాయిల‌ని అస‌హ్యించుకునే వ్య‌క్తి కాస్త వారికి సంబంధించిన ప్ర‌తి విష‌యంలోనూ హెల్పింగ్ నేచ‌ర్‌తో ఎందుకు ప్ర‌వ‌రిస్తున్నాడో ఓ పాత్ర వివ‌రిస్తుంద‌ట‌.

ఈ పాత్ర‌లోనే స‌మంత క‌నిపిస్తుంద‌ని టాక్‌. పాత్ర ప‌రిధి చిన్న‌దే అయినా.. ఆక‌ట్టుకునేలా ఉంటుంద‌ని స‌మాచారం. మ‌రి.. మావ‌య్య చిత్రంలో అతిథిగా క‌నిపిస్తున్న సామ్‌ ఏ మేరకు మురిపిస్తుందో చూద్దాం.

పోర్చుగ‌ల్ నేప‌థ్యంలో సాగే ‘మ‌న్మ‌థుడు 2’.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

‘మ‌న్మ‌థుడు 2’లో స‌మంత పాత్ర అదేనా? | actioncutok.com

Trending now: