‘స‌రిలేరు నీకెవ్వ‌రు’కి.. దిల్ రాజు సెంటిమెంట్‌!


'స‌రిలేరు నీకెవ్వ‌రు'కి.. దిల్ రాజు సెంటిమెంట్‌!

‘స‌రిలేరు నీకెవ్వ‌రు’కి.. దిల్ రాజు సెంటిమెంట్‌!

టాలీవుడ్‌లో గ‌త ప‌ద‌హారేళ్ళుగా సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నాడు ‘దిల్’ రాజు. తాజాగా మ‌హేశ్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రాజు.. ఇప్పుడు మహేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ రోజు లాంఛ‌నంగా ప్రారంభ‌మైన‌ ఈ సినిమా.. 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… సంక్రాంతి సీజ‌న్‌లో ‘దిల్’ రాజు నుంచి రాబోతున్న ఐదో చిత్ర‌మిది. గ‌తంలో ఆయ‌న నిర్మించిన ‘సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు’ (2013), ‘ఎవ‌డు’ (2014), ‘శ‌తమానంభ‌వ‌తి’ (2017), ‘ఎఫ్ 2’ (2019)  చిత్రాలు సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లై  విజ‌యం సాధించ‌గా… ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా అదే సంక్రాంతికి విడుద‌ల కానుండ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.  ఇప్ప‌టికే సంక్రాంతి సీజ‌న్‌లో నాలుగు విజ‌యాల‌ను అందుకున్న రాజు.. ‘సరిలేరు నీకెవ్వరు’తో మరోసారి సంక్రాంతి విజయాన్ని అందుకుని సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.

‘స‌రిలేరు నీకెవ్వ‌రు’కి.. దిల్ రాజు సెంటిమెంట్‌! | actioncutok.com

More for you: