స్టార్ హీరోయిన్స్ క‌లిసొస్తారా?


స్టార్ హీరోయిన్స్ క‌లిసొస్తారా?

స్టార్ హీరోయిన్స్ క‌లిసొస్తారా?

న‌టుడిగా శ‌ర్వానంద్‌ది ఒక‌టిన్న‌ర ద‌శాబ్ద ప్ర‌యాణం. ఈ ప‌దిహేనేళ్ళ సినీ journey లో పాతిక పైగా చిత్రాల‌లో క‌నిపించిన శ‌ర్వానంద్‌కి.. విజ‌యాల శాతం కంటే అప‌జ‌యాల శాత‌మే ఎక్కువ‌. ఇక‌ సోలో హీరోగా గుర్తుంచుకోద‌గ్గ విజ‌యాలంటే.. ‘గ‌మ్యం’, ‘జ‌ర్నీ’ (త‌మిళ అనువాద చిత్రం), ‘ర‌న్ రాజా ర‌న్‌’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘శ‌తమానం భ‌వ‌తి’ మాత్ర‌మే.

స్టార్ హీరోయిన్స్ క‌లిసొస్తారా?

కాగా.. ‘శ‌త‌మానం భ‌వతి’ త‌రువాత స‌రైన విజ‌యం లేని శ‌ర్వా.. ప్ర‌స్తుతం రెండు చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలే.. ‘ర‌ణ‌రంగం’, ’96’ remake. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఈ రెండు చిత్రాలలోనూ ఇద్ద‌రు స్టార్ హీరోయిన్‌ల‌తో తొలిసారిగా జోడీక‌ట్టాడు శ‌ర్వా. ‘ర‌ణ‌రంగం’లో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఓ నాయిక‌గా న‌టించ‌గా.. ’96’ రీమేక్‌లో స‌మంత హీరోయిన్ గా న‌టిస్తోంది.  మ‌రి.. స్టార్ హీరోల ప‌క్క‌న ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌లో సంద‌డి చేసిన ఈ ఇద్ద‌రు భామ‌లైనా.. క‌ష్ట‌కాలంలో ఉన్న‌ శ‌ర్వానంద్‌కి క‌లిసొస్తారేమో చూడాలి.

స్టార్ హీరోయిన్స్ క‌లిసొస్తారా?

కాగా.. ‘ర‌ణ‌రంగం’ ఆగ‌స్టు 2న విడుద‌ల కానుండ‌గా.. ’96’  రీమేక్‌  సెప్టెంబ‌ర్ నెల‌లో release కానుంది.

స్టార్ హీరోయిన్స్ క‌లిసొస్తారా? | actioncutok.com

More for you: