‘దేవ‌దాస్‌’ ద‌ర్శ‌కుడితో శ‌ర్వా?


'దేవ‌దాస్‌' ద‌ర్శ‌కుడితో శ‌ర్వా?

‘దేవ‌దాస్‌’ ద‌ర్శ‌కుడితో శ‌ర్వా?

శ‌ర్వానంద్ హిట్ ముఖం చూసి చాన్నాళ్ళే అయింది. రెండేళ్ళ క్రితం సంక్రాంతికి విడుద‌లైన ‘శ‌తమానం భ‌వ‌తి’ త‌రువాత శ‌ర్వా నుంచి వ‌చ్చిన ఏ ప్రోడ‌క్ట్ కూడా హిట్ లిస్ట్‌లోకి చేర‌లేక‌పోయింది. ‘శ‌త‌మానం భ‌వ‌తి’ అనంత‌రం వ‌చ్చిన ‘రాధ‌’ డిజాస్ట‌ర్ కాగా.. ‘మ‌హానుభావుడు’ ఎబోవ్ యావ‌రేజ్ మూవీగా నిల‌చింది. ఆపై లాంగ్ గ్యాప్ తీసుకుని మ‌రీ వ‌చ్చిన ‘ప‌డి ప‌డి లేచె మ‌న‌సు’ అయితే శ‌ర్వానంద్‌ని పూర్తిగా నిరాశ‌లో ముంచేసింది. ఈ నేప‌థ్యంలో.. ఈ యువ క‌థానాయ‌కుడికి విజ‌యం ఆవ‌శ్య‌క‌మైంది.

కాగా.. ప్ర‌స్తుతం సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్ మూవీని కంప్లీట్ చేసే ప‌నిలో బిజీగా ఉంటూనే.. ’96’ రీమేక్ షూట్‌లో కూడా పాల్గొంటున్నాడు శ‌ర్వానంద్‌. ఈ లోపే.. నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని సెట్ చేసే ప‌నిలో ప‌డ్డాడు ఈ టాలెంటెడ్ హీరో.  ‘భ‌లే మంచి రోజు’, ‘శ‌మంత‌క‌మ‌ణి’, ‘దేవ‌దాస్‌’ చిత్రాల ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని టేక‌ప్ చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. అంతేకాదు.. ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

మ‌రి.. ఈ మూడు చిత్రాల‌తోనైనా శర్వా మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌స్తాడేమో చూడాలి.

‘దేవ‌దాస్‌’ ద‌ర్శ‌కుడితో శ‌ర్వా? | actioncutok.com

More for you: