షాకింగ్: ‘సాహో’ నుంచి తప్పుకున్న మ్యూజిక్ డైరెక్టర్లు


షాకింగ్: 'సాహో' నుంచి తప్పుకున్న మ్యూజిక్ డైరెక్టర్లు

షాకింగ్: ‘సాహో’ నుంచి తప్పుకున్న మ్యూజిక్ డైరెక్టర్లు

దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్ సినిమా ‘సాహో’ నుంచి మ్యూజిక్ డైరెక్టర్లు తప్పుకోవడం సంచలనం సృష్టించింది. ఆగస్ట్ 15న సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఇప్పటికే ఈ సినిమా పాటలకు బాణీలు అందించిన సుప్రసిద్ధ సంగీత దర్శక త్రయం శంకర్-ఎహ్‌సాన్-లాయ్ తాము ‘సాహో’ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

“మా అభిమానులకు చెప్పదలచుకున్నదేమంటే ‘సాహో’ మ్యూజిక్ కంపోజింగ్ నుంచి మేం తప్పుకుంటున్నాం. సినిమా విషయంలో ప్రభాస్, సుజీత్, వంశి, ప్రమోద్, శ్యాంలకు మంచి జరగాలని కోరుకుంటున్నాం” అని వారు తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. ‘సాహో’ కొత్త పోస్టర్‌ను ప్రభాస్ వెల్లడించిన రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. సోమవారం ప్రభాస్ వెల్లడించిన పోస్టర్‌లో మ్యూజిక్ డైరెక్టర్స్ పేరు లేకపోవడం గమనార్హం.

అయినప్పటికీ, శంకర్-ఎహ్‌సాన్-లాయ్ బాణీలు అందించిన పాటలు సినిమాలో యథాతథంగా ఉంటాయని సమాచారం. రీరికార్డింగ్ నుంచి మాత్రమే వాళ్లు తప్పుకున్నారు. దీంతో రీరికార్డింగ్ కోసం మరో మ్యూజిక్ డైరెక్టర్‌ని వెతికే పనిలో ఉన్నారు దర్శక నిర్మాతలు. రీరికార్డింగ్ స్పెషలిస్ట్ తమన్‌కు ఆ అవకాశం దక్కవచ్చని వినిపిస్తోంది. అనుకున్న సమయానికి వేగంగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వగల సామర్థ్యం తమన్‌కి ఉన్నందున అతడినే సంప్రదిస్తున్నారు.

కాగా శంకర్-ఎహ్‌సాన్-లాయ్ అసలెందుకు మధ్యలో తప్పుకున్నారనే విషయం వెల్లడి కాలేదు. అనుకున్న సమయానికి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వలేమని వాళ్లు తప్పుకున్నారనేది ఒక ప్రచారం.

షాకింగ్: 'సాహో' నుంచి తప్పుకున్న మ్యూజిక్ డైరెక్టర్లు

షాకింగ్: ‘సాహో’ నుంచి తప్పుకున్న మ్యూజిక్ డైరెక్టర్లు | actioncutok.com

More for you: