మెగాస్టార్‌తో ‘జెర్సీ’ స్టార్?

మెగాస్టార్‌తో ‘జెర్సీ’ స్టార్?
కన్నడ బ్లాక్‌బస్టర్ U Turn తో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఆకర్షించిన ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాథ్. తాజాగా Jersey తో టాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధ.. తొలి తెలుగు చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే.. ఈ talented beauty ఓ క్రేజీ ఆఫర్ దక్కిందని సమాచారం. అది కూడా.. megastar చిరంజీవికి జోడీగా ఛాన్స్ అని ఫిల్మ్‌నగర్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. ‘సైరా.. నరసింహారెడ్డి’ తరువాత చిరంజీవి తన next project ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇద్దరు కథానాయికలకు స్థానమున్న ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్గా నయనతార పేరు వినిపిస్తుండగా.. మరో నాయిక పాత్రకు శ్రద్ధ పేరు పరిశీలిస్తున్నారని తెలిసింది.
వాస్తవానికి ఈ పాత్ర కోసం తమన్నా పేరు ప్రముఖంగా వినిపించినా.. Jersey చూసి శ్రద్ధ అయితేనే బావుంటుందని కొరటాల భావించాడట. ఏదేమైనా.. శ్రద్ధ ఎంట్రీపై clarity రావాల్సి ఉంది.
మెగాస్టార్‌తో ‘జెర్సీ’ స్టార్? | actioncutok.com
More for you: