‘మహర్షి’కి తోడుగా ‘సీత’!


కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా నటించిన ‘సీత’ సినిమా ట్రైలర్‌ను ‘మహర్షి’ ఆడే అన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు.

'మహర్షి'కి తోడుగా 'సీత'!

‘మహర్షి’కి తోడుగా ‘సీత’!

తేజ దర్శకత్వంలో రూపొందిన ‘సీత’ సినిమా మే 24న విడుదలకు సిద్ధమవుతోంది. ‘కవచం’ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన సినిమా ఇది. మన్నారా చోప్రా మరో నాయికగా కనిపించనున్నది.

ఇప్పటివరకు తీసిన చిత్రాలకు భిన్నంగా ‘సీత’ను రూపొందించాడు తేజ. ఉద్రేక స్వభావురాలైన ఒక బిజినెస్ వుమన్‌కూ, అమాయకుడైన ఒక యువకుడికీ మధ్య ప్రేమ కథ ఈ సినిమా. ‘సీత’కు క్రేజ్ తీసుకు రావడం కోసం ప్రమోషన్‌ను పూర్తి స్థాయిలో స్పీడ్ చేస్తున్నారు.

అందులో భాగంగా ‘మహర్షి’ సినిమా విడుదలవుతున్న అన్ని థియేటర్లలోనూ ‘సీత’ ట్రైలర్‌ను ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేశారు. ఇది ‘సీత’కు మంచి ప్రచారాన్ని తీసుకు వస్తుందని దర్శక నిర్మాతలు తేజ, అనిల్ సుంకర భావిస్తున్నారు. సందర్భవశాత్తూ మహేశ్ తదుపరి సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తుండటం గమనార్హం.

సోను సూద్ విలన్‌గా నటించిన ‘సీత’కు అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు.

‘మహర్షి’కి తోడుగా ‘సీత’! | actioncutok.com

Trending now: