2020 సంక్రాంతికి అరడజను చిత్రాలు

2020 సంక్రాంతికి అరడజను చిత్రాలు
తెలుగువారికే కాదు తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా సంక్రాంతి పర్వదినం ఎంతో ప్రత్యేకం. అందుకే.. ఆ సీజన్లో ప్రతి ఏడాది ఆసక్తికరమైన చిత్రాలు విడుదలవుతుంటాయి. సహజంగా.. సంక్రాంతి తరుణంలో అగ్ర కథానాయకుల చిత్రాల సందడే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాగే అప్పుడప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి.
ఇదిలా ఉంటే.. 2020 సంక్రాంతికి ఇంకా టైమ్ ఉన్నా.. అప్పుడే ఈ సీజన్లో రాబోయే చిత్రాలపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదేమిటంటే.. అరడజను చిత్రాలు వచ్చే ఏడాది ముగ్గుల పండక్కి రాబోతున్నాయట. వీటిలో 5 స్ట్రయిట్ పిక్చర్స్ కాగా, ఒకటి డబ్బింగ్ సినిమా కావడం విశేషం.
ఆ సినిమాల వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ హీరోగా కె.యస్.రవికుమార్ రూపొందించనున్న చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రానుండగా.. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్గా తెరకెక్కనున్న నాగార్జున ‘బంగార్రాజు’ కూడా అదే టైమ్లో రిలీజ్ కాబోతోందట. ఇక మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రానున్న చిత్రంతో పాటు అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న సినిమా కూడా 2020 సంక్రాంతిని టార్గెట్ చేసుకున్నాయని సమాచారం.
అలాగే సాయితేజ్, మారుతి కాంబోలో రానున్న సినిమాతో పాటు రజనీకాంత్ తమిళ అనువాద చిత్రం ‘దర్బార్’ కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది. మరి.. ఈ ఆరు చిత్రాల్లో ఏయే సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతాయో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.
2020 సంక్రాంతికి అరడజను చిత్రాలు | actioncutok.com
More for you: