పాలిటిక్స్: స్మృతి ఇరానీకి షాకిచ్చిన జనం


రాహుల్ గాంధీని విమర్శిద్దామని అనుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి జనం షాకిచ్చారు.

పాలిటిక్స్: స్మృతి ఇరానీకి షాకిచ్చిన జనం
Smriti Irani

పాలిటిక్స్: స్మృతి ఇరానీకి షాకిచ్చిన జనం

భోపాల్ : మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజెపి నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ప్రజలు పెద్ద షాకిచ్చారు. ఆమె బుధవారం అశోక్ నగర్ ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ “కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్టుగా  రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు రుణమాఫీ అందిందా?” అని స్మృతి ప్రశ్నించారు.

సభకు హాజరైనవారు పెద్దపెట్టున ఒక్కసారిగా “అందింది.. అందింది..” అంటూ అరిచారు. దీంతో స్మృతి కంగుతిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ట్విటర్‌లో పోస్టు చేస్తూ బీజేపీపై వ్యంగాస్త్రం విసిరింది. “వారి అబద్ధాలకు ఇప్పుడు ప్రజలు కూడా నేరుగా జవాబిస్తున్నారు” అంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.

పాలిటిక్స్: స్మృతి ఇరానీకి షాకిచ్చిన జనం | actioncutok.com

Trending now: