ప్రభాస్ దర్శకులకి పరీక్షా కాలమే!

ప్రభాస్ దర్శకులకి పరీక్షా కాలమే!
‘బాహుబలి’ సిరీస్‌తో ప్రభాస్ స్థాయి అమాంతం పెరిగింది. అంతేకాదు.. అతని నెక్ట్స్ప్రాజెక్ట్స్ కూడా రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ప్రభాస్ నుంచి రానున్న తదుపరి రెండు చిత్రాలు కూడా కేవలం ఒక సినిమా అనుభవం దర్శకులతోనే రూపొందుతున్నాయి.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ‘సాహో’ని ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ రూపొందిస్తుండగా.. పీరియాడిక్ లవ్‌స్టోరీ ‘జాన్’ (ప్రచారంలో ఉన్న పేరు)ని ‘జిల్’ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. అంతేకాదు.. ఈ రెండు చిత్రాలు కూడా ట్రైలింగ్వల్ మూవీస్ కావడం గమనార్హం. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమాలు ఏకకాలంలో తెరకెక్కుతున్నాయి.
ఇదిలా ఉంటే.. తెలుగునాట గత కొంతకాలంగా ‘ద్వితీయ విఘ్నం’ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే.. తొలి చిత్రాలతో అలరించిన దర్శకులకు రెండో సినిమాలతో చేదు అనుభవాలు ఎదురవడం. ఈ నేపథ్యంలో.. అసలే భారీ చిత్రాలు కావడం.. దానికి తోడు ‘బాహుబలి’ సిరీస్ తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమాలు కావడంతో.. ఈ దర్శకులకు ఆయా చిత్రాలు పరీక్ష పెడుతున్నట్లయ్యింది. మరి.. సుజీత్, రాధాకృష్ణ ఏ మేరకు ఈ పరీక్షల్లో రాణిస్తారో చూడాలి.
ప్రభాస్ దర్శకులకి పరీక్షా కాలమే! | actioncutok.com