ర‌కుల్ ప్రీత్ సింగ్‌కి ప‌రీక్షా కాలం!


ర‌కుల్ ప్రీత్ సింగ్‌కి ప‌రీక్షా కాలం!
Rakul Preet Singh

ర‌కుల్ ప్రీత్ సింగ్‌కి ప‌రీక్షా కాలం!

ఒంపుసొంపుల ప్ర‌ద‌ర్శ‌న‌లో ప‌ట్టా పొందిన ఢిల్లీ డాళ్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. న‌ట‌న‌లో మాత్రం ఓన‌మాలు స్థాయికే ప‌రిమిత‌మైంది. అయిన‌ప్ప‌టికీ.. అదృష్టం తోడై అన‌తికాలంలోనే అగ్ర క‌థానాయిక‌గా పేరు తెచ్చుకుంది. ఇదంతా.. రెండు మూడేళ్ళ క్రితం సంగ‌తి.

ప్ర‌స్తుతం విష‌యానికి వ‌స్తే.. ‘స్పైడ‌ర్‌’ ఇచ్చిన స్ట్రోక్ త‌రువాత చేతిలో స‌రైన సినిమా లేకుండాపోయినా.. బిజీగానే గ‌డిపేస్తోందీ ముద్దుగుమ్మ‌. తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో క‌లుపుకుని దాదాపు ఐదు చిత్రాలు ఈ అమ్మ‌డి ఖాతాలో ఉన్నాయి. 

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. వీటిలో రెండు చిత్రాలు ఈ నెల‌లోనే రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. అందులో ఒక‌టి.. అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో న‌టించిన హిందీ చిత్రం ‘దే దే ప్యార్ దే’ కాగా.. మ‌రొక‌టి సూర్య‌కి జోడీగా న‌టించిన త‌మిళ చిత్రం ‘ఎన్జీకే’. ‘దే దే ప్యార్ దే’ ఈ నెల 17న విడుద‌ల కానుండ‌గా.. ‘ఎన్జీకే’ 31న త‌మిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది.

ఈ నేప‌థ్యంలో.. ఈ రెండు సినిమాల ఫ‌లితాలు ర‌కుల్‌కి కీల‌కంగా మారాయి. గ‌త కొంత‌కాలంగా విజ‌యం కోసం చ‌కోర ప‌క్షిలా ఎదురుచూస్తున్న ర‌కుల్‌కి.. ఈ చిత్రాలు ఏ మేర‌కు ప్ల‌స్ అవుతాయో చూడాలి. ఏదేమైనా.. ర‌కుల్‌కి ఇది ప‌రీక్షా కాల‌మే మ‌రి.

అన్న‌ట్టు.. తెలుగులో నాగార్జునకి జోడీగా ‘మ‌న్మ‌థుడు 2’లో న‌టిస్తోంది ర‌కుల్‌. ఈ చిత్రం జూలైలో విడుద‌ల కానుంద‌ని టాక్‌.

ర‌కుల్ ప్రీత్ సింగ్‌కి ప‌రీక్షా కాలం! | actioncutok.com

Trending now: