అది ‘మ‌హ‌ర్షి’ సీక్వెల్ కాద‌ట‌!


అది 'మ‌హ‌ర్షి' సీక్వెల్ కాద‌ట‌!

అది ‘మ‌హ‌ర్షి’ సీక్వెల్ కాద‌ట‌!

‘మ‌హ‌ర్షి’.. ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చిన చిత్రం.  మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన ఈ సినిమా కొన్ని చోట్ల లాభాలు ఆర్జిస్తే.. మ‌రికొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ స్టేజ్‌లో ఉంది. ఇంకొన్ని చోట్ల న‌ష్టాల‌ను చూస్తోంది. మొత్తంగా.. మిశ్ర‌మ ఫ‌లితాన్ని పొందిందీ చిత్రం.

ఇదిలా ఉంటే.. ‘మ‌హ‌ర్షి’ త‌రువాత మ‌హేశ్ బాబు, వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతుంద‌టూ వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఏడాది వేస‌విలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంద‌ని కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి. అంతేకాదు.. ‘మ‌హ‌ర్షి’కి సీక్వెల్‌గా ఈ సినిమా ఉంటుంద‌నే మాట‌లు కూడా వినిపిస్తున్నాయి.

అయితే.. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమాకి క‌థే సిద్ధం కాలేద‌ట‌. జ‌స్ట్‌.. మ‌హేశ్ త‌న‌కు సూట్ అయ్యేలా మ‌రో క‌థ‌ను సిద్ధం చేసుకోమ‌ని వంశీకి సూచించాడ‌ట‌. ప్ర‌స్తుతం వంశీ ఆ ప‌నిలోనే ఉన్నాడ‌ని టాక్‌. అంతేకాదు.. మ‌హేశ్‌, వంశీ నెక్ట్స్ ఫిల్మ్‌ ‘మ‌హ‌ర్షి’కి సీక్వెల్ మాత్రం కాద‌ని తెలిసింది.

మ‌రి.. ‘మ‌హ‌ర్షి’తో కొన్ని వ‌ర్గాల నుంచే ఆమోద‌ ముద్ర పొందిన మ‌హేశ్‌, వంశీ కాంబో.. రానున్న చిత్రంతోనైనా అన్ని వ‌ర్గాల‌ను అల‌రిస్తుందేమో చూద్దాం.

అది ‘మ‌హ‌ర్షి’ సీక్వెల్ కాద‌ట‌! | actioncutok.com

More for you: