అడవి బాటలో టాప్ డైరెక్టర్!


‘రంగ‌స్థ‌లం’తో గత ఏడాది అద్భుత విజ‌యాన్ని అందుకున్న సుకుమార్‌.. బ‌న్నీతో చేయ‌బోయే కొత్త చిత్రం కోసం లొకేష‌న్ల వేట ప‌డుతున్నాడ‌ని సమాచారం.

అడవి బాటలో టాప్ డైరెక్టర్!
Sukumar

అడవి బాటలో టాప్ డైరెక్టర్!

‘రంగ‌స్థ‌లం’.. గ‌త ఏడాది సంచ‌ల‌నం. ఈ సినిమాతో.. ‘రంగ‌స్థ‌లం’కి ముందు, త‌రువాత అన్న‌ట్లుగా ద‌ర్శ‌కుడు సుకుమార్ కెరీర్ గ్రాఫ్ మారిపోయింది. ఈ నేప‌థ్యంలో.. త‌న అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్ విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తున్నాడు సుక్కు. త‌న తొలి చిత్ర క‌థానాయ‌కుడు అల్లు అర్జున్‌తో చేస్తున్న ఈ సినిమా.. రేపు (మే 11) లాంఛ‌నంగా ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. అలాగే.. రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగ‌స్టు నుంచి మొద‌లు కావ‌చ్చ‌ని స‌మాచారం.

కాగా.. స్క్రిప్ట్ వ‌ర్క్‌ని ఒక కొలిక్కి తీసుకువ‌చ్చిన సుకుమార్.. ప్ర‌స్తుతం లొకేష‌న్లను వెతికే ప‌నికి సిద్ధ‌మ‌వుతున్నాడ‌ట‌. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంద‌ని టాక్‌. శేషాచ‌లం అడ‌వుల చుట్టూ తిరిగే స‌బ్జెక్ట్ కావ‌డంతో అందుకు త‌గ్గ లొకేష‌న్ల వేట‌కు సుకుమార్ అండ్ కో స‌న్న‌ద్ధ‌మ‌వుతోంద‌ట‌.

అలాగే.. చిత్తూరు, నెల్లూరు ప‌రిస‌ర ప్రాంతాల్లోనూ ఈ సినిమా షూటింగ్ జరుగుతుంద‌ని.. ఈ నేప‌థ్యంలో అక్క‌డ కూడా లొకేష‌న్ల‌ను వెతికే ప‌నిని పెట్టుకున్నాడ‌ట సుక్కు.  మ‌రి.. ‘రంగ‌స్థ‌లం’ మ్యాజిక్‌ని ఈ సినిమా విష‌యంలోనూ సుకుమార్ కొన‌సాగిస్తాడేమో చూడాలి.

బ‌న్నీకి జోడీగా ర‌ష్మిక న‌టించ‌నున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

అడవి బాటలో టాప్ డైరెక్టర్! | actioncutok.com

Trending now: