వెంకీ.. వాటికే ప‌రిమిత‌మ‌వుతాడా?


వెంకీ.. వాటికే ప‌రిమ‌త‌మ‌వుతాడా?
Venkatesh

వెంకీ.. వాటికే ప‌రిమ‌త‌మ‌వుతాడా?

‘ఎఫ్ 2’.. సీనియ‌ర్ హీరో వెంక‌టేశ్ కెరీర్‌లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చిన చిత్రం. అంతేకాదు.. ఈ సినిమాకి యు.ఎస్‌.పి (యూనిక్ సెల్లింగ్ పాయింట్‌) కూడా వెంకీ అనే చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌య‌క్తి లేదు. త‌న కామెడీ టైమింగ్‌తో స‌ద‌రు చిత్రాన్ని నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్ళాడు వెంకీ. 

వాస్త‌వానికి.. ‘ఎఫ్ 2’కి ముందు వెంకీ కెరీర్ ఊగిస‌లాట‌లో ఉంది. ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలో.. ఎలాంటి పాత్ర‌లు త‌న ఏజ్‌, ఇమేజ్‌కి న‌ప్పుతాయో తెలియ‌ని సందిగ్ధ ప‌రిస్థితి అది. అలాంటి త‌రుణంలో.. ‘ఎఫ్ 2’ చేయ‌డం, అది కాస్త క్లిక్ అవ‌డంతో.. వెంకీకి కూడా ఇప్పుడు క్లియ‌ర్ పిక్చ‌ర్ వ‌చ్చింది. చేస్తే గీస్తే.. కామెడీ ట‌చ్ ఉన్న పాత్ర‌లున్న‌ సినిమాలే చేయాలని.. అలాగే ప్రేక్ష‌కులు కూడా  త‌న నుంచి అలాంటి సినిమాలే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నార‌ని.

అందుకే.. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న ‘వెంకీమామ‌’లోనూ ఆ త‌ర‌హా పాత్ర‌లోనే న‌టిస్తున్నాడ‌ట వెంకీ. అంతేకాదు.. ‘సినిమా చూపిస్త మావ‌’, ‘నేను లోక‌ల్‌’ చిత్రాల ద‌ర్శ‌కుడు త్రినాథరావు న‌క్కిన కాంబినేష‌న్‌లో చేయ‌నున్న మూవీ కూడా ఇదే బాప‌తు అని టాలీవుడ్ టాక్‌. ఇందులోనూ వెంకీ పాత్ర‌కి బోలెడంత హ్యూమ‌ర్ ట‌చ్ ఉంటుంద‌ని ప‌లు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. మ‌రి.. జ‌నం మెచ్చిన బాట‌లోనే వెళ్ళాల‌ని డిసైడ్ అయిన వెంకీ.. రానున్న హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో ఏ మేర‌కు మెప్పిస్తాడో చూద్దాం.

వెంకీ.. వాటికే ప‌రిమ‌త‌మ‌వుతాడా? | actioncutok.com

Trending now: