భార‌త స‌రిహ‌ద్దులో ‘వెంకీమామ‌’


భార‌త స‌రిహ‌ద్దులో 'వెంకీమామ‌'

భార‌త స‌రిహ‌ద్దులో ‘వెంకీమామ‌’

రియ‌ల్ లైఫ్‌లో మేన‌మామ‌, మేన‌ల్లుళ్ళు అయిన వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌.. రీల్ లైఫ్‌లోనూ అవే పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ‘వెంకీమామ‌’. హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో వెంకీ రైస్ మిల్ ఓన‌ర్‌గా క‌నిపించ‌నుండగా.. చైతూ ఆర్మీ ఆఫీస‌ర్ రోల్‌లో న‌టిస్తున్నాడు.

‘ప‌వ‌ర్‌’, ‘స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌’, ‘జై ల‌వ కుశ‌’ చిత్రాల ద‌ర్శ‌కుడు కె.య‌స్‌.ర‌వీంద్ర (బాబీ) రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌.. ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్‌ని పూర్తిచేసుకుంది. మొద‌టి షెడ్యూల్‌ని రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో పూర్తిచేయ‌గా.. రెండో షెడ్యూల్ తాలూకు చిత్రీక‌ర‌ణ‌ని హైద‌రాబాద్‌లో జ‌రిపారు.

కాగా.. వెంకీమామ‌ మూడో షెడ్యూల్‌ని భార‌త స‌రిహ‌ద్దులో పిక్చ‌రైజ్ చేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఆర్మీ అధికారి అయిన చైతూపై చిత్రీక‌రించే ఈ సన్నివేశాల కోసం.. లొకేష‌న్ల‌ని అన్వేషించే ప‌నిలో బిజీగా ఉంది యూనిట్‌. అంతేకాదు.. ఈ స‌న్నివేశాలు సినిమాలో కీల‌కంగా ఉంటాయ‌ని స‌మాచారం.

వెంకీకి జోడీగా పాయల్ రాజ్‌పుత్‌, చైతూకి జంట‌గా రాశీ ఖ‌న్నా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

భార‌త స‌రిహ‌ద్దులో ‘వెంకీమామ‌’ | actioncutok.com

Trending now: