ముందే వ‌స్తున్న ‘వెంకీమామ‌’


ముందే వ‌స్తున్న 'వెంకీమామ‌'

ముందే వ‌స్తున్న ‘వెంకీమామ‌’

నిజ‌ జీవితంలో మేన‌మామ మేన‌ల్లుళ్ళు అయిన వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌.. తెర‌జీవితంలోనూ అవే పాత్ర‌ల‌తో సంద‌డి చేయ‌నున్న చిత్రం ‘వెంకీమామ‌’. కె.య‌స్‌.ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాని డి.సురేశ్ బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్ర‌స్తుతం క‌శ్మీర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఓ కీల‌క షెడ్యూల్‌ను జ‌రుపుకుంటోంది. ఆర్మీ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల‌ను అక్క‌డ చిత్రీక‌రిస్తున్నారు. ఆర్మీ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్న చైతూతో పాటు వెంకీ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నాడు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాని ద‌స‌రా కానుక‌గా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. అంత‌కంటే ముందే ‘వెంకీమామ‌’ ఆగ‌మ‌నం ఉంటుంద‌ట‌. క‌రెక్ట్‌గా చెప్పాలంటే.. సెప్టెంబ‌ర్ 13న ‘వెంకీమామ‌’ రిలీజ‌య్యే అవ‌కాశ‌ముంద‌ని తెలిసింది. సో.. మామాఅల్లుళ్ళ సంద‌డి కాస్తంత ముందుగానే షురూ అవుతుంద‌న్న‌మాట‌.

వెంకీకి జోడీగా పాయ‌ల్ రాజ్‌పుత్‌, చైతూకి జంట‌గా రాశీ ఖ‌న్నా న‌టిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీత‌మందిస్తున్నాడు.

ముందే వ‌స్తున్న ‘వెంకీమామ‌’ | actioncutok.com

More for you: