రాళ్లపల్లి ఇకలేరు


రాళ్లపల్లి ఇకలేరు
Rallapalli

రాళ్లపల్లి ఇకలేరు 

ప్రముఖ నటుడు, నాటక ప్రయోక్త  రాళ్లపల్లి వెంకట నర్సింహారావు దివంగతులయ్యారు. ఆయన చాలా కాలంగా   శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శుక్రవారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మోతీ నగర్‌లోని ఆయన నివాసం నుంచి కుటుంబ సభ్యులు మ్యాక్స్‌ క్యూర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాళ్లపల్లి తుదిశ్వాస విడిచారు.

తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో 1945 అక్టోబర్‌ 10న జన్మించిన రాళ్లపల్లి చదువుకునే రోజుల నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన  స్టేజి నటుడిగా విశేష ప్రాచుర్యం పొందారు. 1979లో ‘కుక్కకాటుకు చెప్పుదెబ్బ’తో సినీ రంగ ప్రవేశం చేసిన రాళ్లపల్లి అనేక విజయవంతమైన సినిమాల్లో నటించారు.

‘చలి చీమలు’, ‘శుభలేఖ’, ‘ఖైదీ’, ‘ఆలయశిఖరం’, ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘అభిలాష’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘సితార’, ‘అన్వేషణ’, ‘ఆలాపన’, ‘న్యాయానికి సంకెళ్లు’, ‘ఏప్రిల్‌ 1 విడుదల’, ‘సూర్య ఐపీఎస్‌’, ‘దొంగ పోలీసు’, ‘కన్నయ్య కిట్టయ్య’ తదితర 850కి పైగా చిత్రాల్లో నటించారు. దాదాపు 3 దశాబ్దాలకుపైగా సినీ పరిశ్రమకు ఆయన విశేష సేవలందించారు.

రాళ్లపల్లి ఇకలేరు | actioncutok.com

More for you: