నితిన్ హీరోయిన్‌కి సక్సెస్ దక్కేనా?


నితిన్ హీరోయిన్‌కి సక్సెస్ దక్కేనా?
Megha Akash

నితిన్ హీరోయిన్‌కి సక్సెస్ దక్కేనా?

రెండేళ్ళ క్రితం విడుద‌లైన ‘లై’ చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది మేఘా ఆకాశ్‌.  మొద‌టి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డినా.. ‘లై’ హీరో నితిన్‌తోనే రెండో చిత్రం కూడా చేసిందీ అమ్మ‌డు. ‘ఛ‌ల్ మోహ‌న్ రంగ‌’ పేరుతో విడుద‌లైన సద‌రు సినిమా రిజ‌ల్ట్ కూడా సేమ్ టు సేమ్‌.

ఇక త‌న మాతృభాష త‌మిళంలోనూ మేఘ‌కి ఇదే ప‌రిస్థితి. ర‌జ‌నీకాంత్ ‘పేట‌’లో కీల‌క పాత్ర పోషించినా.. శింబుకి జోడీగా ‘అత్తారింటికి దారేది’ రీమేక్ ‘వంద రాజవ‌దాన్ వ‌రువేన్‌’లో మెయిన్ హీరోయిన్‌గా న‌టించినా… ‘బూమ‌రాంగ్’ అనే మ‌రో చిత్రంలో న‌టించినా.. ఆయా సినిమాలు మేఘ‌కి క‌మ‌ర్షియ‌ల్‌గా ఏ మాత్రం వ‌ర్క‌వుట్ కాలేదు.

ఈ నేప‌థ్యంలో..  ప్ర‌స్తుతం రెండు త‌మిళ చిత్రాల‌తో పాటు ఒక హిందీ చిత్రం చేస్తున్న ఈ అమ్మ‌డికి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి రెండు అవ‌కాశాలు ద‌క్కాయి. అందులో ఒక‌టి.. కాజ‌ల్ అగ‌ర్వాల్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మాత రాజ్ కందుకూరి త‌న‌యుడు శివ న‌టిస్తున్న ‘మ‌ను చ‌రిత్ర‌’ కాగా.. మ‌రొక‌టి చిరంజీవి మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ‘ఉప్పెన‌’. వీటిలో ‘మ‌ను చ‌రిత్ర‌’ ఇటీవ‌లే లాంఛ్ అయింది. ఇక నిర్మాణంలో ఉన్న ‘ఉప్పెన‌’కి సంబంధించి మేఘ ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న‌ రావాల్సి ఉంది.

ఏదేమైనా.. ఇప్ప‌టికే ఫ్లాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ చెన్నై బ్యూటీకి ఈ రెండు అవ‌కాశాలు కీల‌క‌మ‌నే చెప్పాలి. మ‌రి.. మేఘ ఈ చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటుందా?  వెయిట్ అండ్ సీ..

నితిన్ హీరోయిన్‌కి సక్సెస్ దక్కేనా? | actioncutok.com

Trending now: