ఒక్క బ్లాక్‌బస్టర్ లేదు.. రెమ్యూనరేషన్ రెండు కోట్లు!


ఒక్క బ్లాక్‌బస్టర్ లేదు.. రెమ్యూనరేషన్ రెండు కోట్లు!
Pooja Hegde

ఒక్క బ్లాక్‌బస్టర్ లేదు.. రెమ్యూనరేషన్ రెండు కోట్లు!

సినిమాల్లో హిట్ వుంటేనే క్రేజ్‌. అది లేక‌పోతే ఎవ‌రూ ప‌ట్టించుకోరు. కానీ పూజా హెగ్డే ప‌రిస్థితి మాత్రం అందుకు భిన్నంగా వుంది. ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ సినిమాల‌తో టాలీవుడ్ ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైన ఈ అమ్మ‌డికి ఈ రెండు చిత్రాలు ప‌రాజ‌యాల్నే మిగిల్చాయి.

అల్లు అర్జున్‌తో చేసిన ‘దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌’ కూడా సోసో గానే ఆడింది. హిట్ లేకపోయినా వ‌రుస క్రేజీ ఆఫ‌ర్‌ల‌ని సొంతం చేసుకుంటోంది. దువ్వాడ‌కు రూ. 75 ల‌క్ష‌లు పారితోషికం తీసుకున్న పూజ ‘అర‌వింద స‌మేత‌’కు ఏకంగా కోటిన్న‌ర డిమాండ్ చేసింద‌ట‌. అయితే ముందు అనుకున్న ప్ర‌కారం కోటీ 25 ల‌క్ష‌ల‌తో స‌రిపెట్టాల‌నుకున్నారు కానీ పూజా హెగ్డే స‌సేమీరా అన‌డంతో కోటిన్న‌ర స‌మ‌ర్పించుకున్నార‌ట‌.

వెంట‌నే మ‌హేష్‌తో ‘మ‌హ‌ర్షి’ చిత్రంలో న‌టించే ఛాన్స్ రావ‌డంతో ఏకంగా త‌న పారితోషికాన్ని రెండు కోట్ల‌కు పెంచేసింది. వ‌రుణ్‌తేజ్ హీరోగా హ‌రీష్‌శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట ‘వాల్మీకి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌మిళ హిట్ చిత్రం ‘జిగ‌ర్తాండ‌’కిది రీమేక్‌.

ఒరిజినల్‌లో సిద్ధార్థ్ చేసిన పాత్రను త‌మిళ హీరో ముర‌ళి త‌న‌యుడు అధ‌ర్వ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం పూజా హేగ్డేని క‌థానాయిక‌గా చిత్ర బృందం ఖ‌రారు చేసిన‌ట్లు తెలిసింది. 15 రోజులు డేట్స్ కేటాయించిన పూజ పారితోషికం మాత్రం రెండు కోట్లు ఇవ్వాల‌ని చెప్పేసింద‌ట‌. హీరోయిన్‌ల కొర‌త వుండ‌టంతో నిర్మాత‌లు ఓకే చెప్పేశారు.

ఒక్క బ్లాక్‌బస్టర్ లేదు.. రెమ్యూనరేషన్ రెండు కోట్లు! | actioncutok.com

Trending now: