వైఎస్ఆర్‌సీఎల్పీ నేతగా జగన్


వైఎస్ఆర్‌సీఎల్పీ నేతగా జగన్

వైఎస్ఆర్‌సీఎల్పీ నేతగా జగన్

అమరావతి :  వైఎస్ఆర్‌సీఎల్పీ నేతగా వైఎస్. జగన్ ఎన్నికయ్యారు. విజయవాడ సమీపంలోని తాడేపల్లి లో ఉన్న జగన్ క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఏకవాక్య తీర్మానంతో జగన్ ను  ఎంపికచేశారు. ఈ సమావేశానికి వైసీపీ శాసన సభ్యులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ తీర్మానం ప్రతిని శనివారం సాయంత్రం హైదరాబాద్ లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు సమర్పిస్తారు.

ఎమ్మెల్యేలతో కలసి వెళ్లి జగన్ ఈ ప్రతిని గవర్నర్ కు అందజేస్తారు. వైసీఎల్పీ సమావేశం ముగిసిన తరువాత పార్లమెంటరీ పార్టీ  సమావేశం జరుగుతుంది. పార్టీ అధ్యక్షుడి నాయకత్వంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ పార్లమెంటరీ పక్ష నాయకుడిని ఎన్నుకుంటారు.

వైఎస్ఆర్‌సీఎల్పీ నేతగా జగన్ | actioncutok.com

More for you: