జలంపై వైసీపీ నాయకుల జులుం


జలంపై వైసీపీ నాయకుల జులుం

జలంపై వైసీపీ నాయకుల జులుం

అనంతపురం : ఏపీలో అధికార పగ్గాలు చేపట్టనున్న వైసీపీ చోటామోటా నాయకులు దాడులకు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. ఇందుకు అనంతపురం మండలంలోని కురుగుంట గ్రామంలో జరిగిన సంఘటనే ఉదాహరణ.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కురుగుంట గ్రామంలో ప్రజల తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు ఎన్టీఆర్‌ సుజల స్రవంతి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. దీంతో  తాగునీటి సమస్య పరిష్కారమయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. దీంతో వైసీపీ స్థానిక నాయకులు హుకుం జారీ చేయడం మొదలెట్టారు.

మీపార్టీ  అధికారం కోల్పోయింది, తక్షణం వాటర్‌ ప్లాంట్‌ను ఈ నెలాఖరులోపు మూసివేయాలని ప్లాంట్‌ నిర్వాహకులకు స్థానిక వైసీపీ నాయకులు హుకుం జారీచేశారు. తమకెందుకు తలనొప్పి అని   ప్లాంట్‌ నిర్వాహకుడు ఆదివారమే దానిని మూసివేశాడు.  వాటర్‌ప్లాంట్‌ మూసివేయడంతో స్థానికులకు మళ్లీ  తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి.

జలంపై వైసీపీ నాయకుల జులుం | actioncutok.com

More for you: