‘సాహో’ కంటే ముందు మనం చూడాల్సిన 10 సినిమాలు


'సాహో' కంటే ముందు మనం చూడాల్సిన 10 సినిమాలు

‘సాహో’ కంటే ముందు మనం చూడాల్సిన 10 సినిమాలు

ప్రభాస్ హీరోగా నటిస్తోన్న భారీ యాక్షన్ మూవీ ‘సాహో’ కోసం ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినీ ప్రియులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదలవుతోంది. ఇప్పట్నుంచి చూసుకుంటే మన ముందుకు రాబోతోన్న తొలి టాప్ స్టార్ సినిమా అదే. అయితే ఈలోగా మీడియం బడ్జెట్‌తో తయారైన, తయారవుతున్న కొన్ని ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆ సినిమాలేవంటే…

హిప్పీ (జూన్ 7)

‘ఆర్ ఎక్స్ 100’ తర్వాత హీరోగా తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ నుంచి వస్తున్న సినిమా ఇదే. దిగాంగన సూర్యవంశి నాయికగా తెలుగు తెరకు పరిచయమవుతున్న ఈ సినిమాలో జె.డి. చక్రవర్తి విలన్‌గా కనిపించనున్నాడు. జజ్బా సింగ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నది. టి.ఎన్. కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పేరుపొందిన తమిళ నిర్మాత కలైపులి ఎస్. థాను నిర్మించగా, ఏషియన్ సినిమాస్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘హిప్పీ’ జూన్ 7న వస్తోంది.

బ్రోచేవారెవరురా (జూన్ 14)

'సాహో' కంటే ముందు మనం చూడాల్సిన 10 సినిమాలు

చక్కని కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ కథానాయకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’. నివేదా థామస్ నాయికగా నటించిన ఈ సినిమాలో సత్యదేవ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషించగా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వినోదాన్ని పంచనున్నారు. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మన్యం ప్రొడక్షన్స్ బేనర్‌పై విజయ్‌కుమార్ మన్యం నిర్మించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా జూన్ 14న విడుదలవుతోంది.

గేం ఓవర్ (జూన్ 14)

'సాహో' కంటే ముందు మనం చూడాల్సిన 10 సినిమాలు

గత ఏడాది తెలుగులో ఒకే సినిమా ‘నీవెవరో’ చేసిన తాప్సీ నటించిన ‘గేం ఓవర్’ సినిమా తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తయారైంది. అంతుచిక్కని శత్రువు నుంచి తప్పించుకోడానికి స్వప్న (తాప్సీ) అనే యువతి ఎన్ని కష్టాలు పడిందనేది ఈ సినిమాలోని ప్రధానాంశం. అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మించాయి. వినోదిని వైద్యనాథన్, అనీష్ కురువిల్లా, సంచనా నటరాజన్ కీలక పాత్రలు చేసిన ఈ థ్రిల్లర్ జూన్ 14న విడుదలవుతోంది.

వజ్ర కవచధర గోవిద (జూన్ 14)

'సాహో' కంటే ముందు మనం చూడాల్సిన 10 సినిమాలు

రెండేళ్ల క్రితం ‘సప్తగిరి ఎల్ఎల్‌బి’ సినిమాతో హీరోగా అవతారం ఎత్తిన కమెడియన్ సప్తగిరి కథానాయకుడిగా వస్తోన్న రెండో సినిమా ‘వజ్ర కవచర గోవింద’. అతడిని హీరోగా పరిచయం చేసిన అరుణ్ పవార్ ఈ సినిమానీ రూపొందించాడు. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తయారైన ఈ సినిమాలో వైభవి జోషి నాయికగా నటించింది. అర్చన, ‘టెంపర్’ వంశీ, అప్పారావ్, అవినాశ్ ప్రధాన పాత్రధారులైన ఈ సినిమాతో కామెడీ హీరోగా నిలదొక్కుకోవాలని సప్తగిరి భావిస్తున్నాడు. జూన్ 14న ఈ సినిమా వస్తోంది.

అర్జున్ సురవరం (జూన్ 21)

'సాహో' కంటే ముందు మనం చూడాల్సిన 10 సినిమాలు

గత ఏడాది నిరాశపర్చిన ‘కిరాక్ పార్టీ’ సినిమా తర్వాత కథనే నమ్ముకొని నిఖిల్ చేసిన సినిమా ‘అర్జున్ సురవరం’. మొదట ‘ముద్ర’ టైటిల్‌తో రూపొందిన సినిమాని, అదే పేరుతో మరో సినిమా రావడంతో అనివార్యంగా టైటిల్ మార్చారు. ఆరు నెలలుగా తరచూ విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాలో లావణ్యా త్రిపాఠి నాయిక. టి. సంతోష్ డైరెక్ట్ చేసిన ‘అర్జున్ సురవరం’ను మూవీ డైనమిక్స్, ఆరా సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తరుణ్ అరోరా విలన్‌గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్, నాగినీడు, సత్య కీలక పాత్రధారులు. జూన్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

కల్కి (జూన్)

'సాహో' కంటే ముందు మనం చూడాల్సిన 10 సినిమాలు

డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటిస్తోన్న ‘కల్కి’ సినిమాపై మంచి బజ్ నడుస్తోంది. ‘అ!’ ఫేం ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తొన్న ఈ సినిమా టైటిల్ లోగో, టీజర్, రాజశేఖర్ లుక్ అందర్నీ ఆకట్టుకున్నాయి అదా శర్మ నాయికగా నటించిన ఈ సినిమాని సి. కల్యాణ్, జీవితా రాజశేఖర్ సంయుక్తంగా నిర్మించారు. ‘పీఎస్‌వీ గరుడవేగ’ సినిమా విజయంతో రాజశేఖర్ కెరీర్‌కు కాస్త ఊరట లభించింది. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తయారైన ఈ సినిమా థియేటర్ హక్కుల్ని ఎంతో నమ్మకంగా రూ. 10 కోట్లు పెట్టి సీనియర్ నిర్మాత కె.కె. రాధామోహన్ కొనుగోలు చేశారు. నందితా శ్వేత మరో నాయికగా నటించిన జూన్ నెలాఖరులోగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఓ బేబీ (జూలై 5)

'సాహో' కంటే ముందు మనం చూడాల్సిన 10 సినిమాలు

కొరియన్ హిట్ ఫిల్మ్ ‘మిస్ గ్రానీ’కి అధికారిక రీమేక్ ‘ఓ బేబీ’. 70 ఏళ్ల వృద్ధురాలు ఒక అందమైన యువతి లాగా మారిపోతే జరిగే పరిణామాలతో ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మంగా రూపొందిన ఈ చిత్రంలో సమంత ప్రధాన పాత్రధారి కాగా నాగశౌర్య హీరో. నందినీరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో లక్ష్మి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. వివాహానంతరం ఆసక్తికర స్క్రిప్టులు, పాత్రలు చేస్తూ ఇమేజ్‌ను మరింతగా పెచుకుంటూ వస్తోన్న సమంత ఈ సినిమాలో చేసిన పాత్రే తన కెరీర్‌లో అత్యుత్తమ పాత్రగా తెలిపింది. ‘కల్యాణ వైభోగమే’ సినిమా తర్వాత మూడేళ్ల విరామంతో నందినీరెడ్డి రూపొందించిన ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

దొరసాని (జూలై 5)

'సాహో' కంటే ముందు మనం చూడాల్సిన 10 సినిమాలు

పెద్దింటి అమ్మాయి, పేదింటి అబ్బాయి ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘దొరసాని’. రాజశేఖర్, జీవిత దంపతుల రెండో కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా, విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాని నూతన దర్శకుడు కేవీఆర్ మహేంద్ర రూపొందించాడు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్‌ రంగినేని సంయుక్తంగా ఈ చిత్రన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ ఆకట్టుకుంది. 1980లలో తెలంగాణలో జరిగిన కథగా ఈ చిత్రం రూపొందింది. ఒక హీరో తమ్ముడు, ఇంకో హీరో కూతురు జంటగా నటించడంతో సహజంగానే ‘దొరసాని’పై అందరి దృష్టీ పడుతోంది.  జూలై 6న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగున్నాయి.

ఇస్మార్ట్ శంకర్ (జూలై 12)

'సాహో' కంటే ముందు మనం చూడాల్సిన 10 సినిమాలు

డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రాం కాంబినేషన్‌లో తయారవుతున్న మొదటి సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని నటి ఛార్మి నిర్మిస్తుండటం గమనార్హం. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకి ‘డబుల్ దిమాక్ హైదరాబాదీ’ అనేది ట్యాగ్ లైన్. హైదరాబాద్ యాసలో రాం చెప్పే డైలాగ్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటాయనేది యూనిట్ సభ్యులు చెప్తున్న మాట. 2015లో వచ్చిన ‘టెంపర్’ తర్వాత 6 సినిమాలు చేసినా విజయాన్ని అందుకోలేకపోయిన జగన్నాథ్ ఈ సినిమాతో పూర్వ వైభవాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాడు. జూలై 12న చిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి.

రాక్షసుడు (జూలై 18)

'సాహో' కంటే ముందు మనం చూడాల్సిన 10 సినిమాలు

బెల్లంకొండ సాయిశ్రీనివస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘రాక్షసుడు’. తమిళంలో విజయం సాధించిన క్రైం థ్రిల్లర్ ‘రాక్షసన్’కు ఇది రీమేక్. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమేశ్‌వర్మ డైరెక్టర్. ఈ సినిమాలో శ్రీనివాస్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా కనిపించనున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ మునుపటి సినిమాలు ‘కవచం’, ‘సీత’.. ఒక దాన్ని మించి మరొకటి డిజాస్టర్స్ అయ్యాయి. సీరియల్ కిల్లర్ కథాంశంతో రూపొందిన ‘రాక్షసుడు’ పైనే అతని ఆశలన్నీ ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ ఇంప్రెసివ్‌గా, ఉత్కంఠభరితంగా, అదే సమయంలో భీతి కొలిపేలా ఉంది. జూలై 18న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

డియర్ కామ్రేడ్ (జూలై 26)

'సాహో' కంటే ముందు మనం చూడాల్సిన 10 సినిమాలు

ఈ ఏడాది ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘డియర్ కామ్రేడ్’ ఒకటి. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండటమే దీనికి కారణం. రష్మికా మండన్న నాయికగా నటిస్తోన్న ఈ సినిమాని నూతన దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనే ట్యాగ్ లైన్‌తో వస్తోన్న ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా కనిపించనున్నాడు. గత ఏడాది చివరలో అనూహ్య విజయం సాధించిన ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ నటిస్తోన్న ఈ సినిమా జూలై 26న విడుదలవుతోంది.

– వనమాలి

‘సాహో’ కంటే ముందు మనం చూడాల్సిన 10 సినిమాలు | actioncutok.com

More for you: