2019 ఫస్టాఫ్: ఆ నలుగురూ కెరీర్ బెస్ట్ సాధించారు!


2019 ఫస్టాఫ్: ఆ నలుగురూ కెరీర్ బెస్ట్ సాధించారు!

2019 ఫస్టాఫ్: ఆ నలుగురూ కెరీర్ బెస్ట్ సాధించారు!

2019 ప్రథమార్ధం.. కొంద‌రు క‌థానాయ‌కుల‌కు గుర్తుండిపోయే విజ‌యాల‌ను అందిస్తే, మ‌రికొంద‌రికి చేదు అనుభ‌వాల‌ను మిగిల్చింది. ముఖ్యంగా.. వెంకటేశ్‌, వరుణ్ తేజ్, నాగ చైతన్య, మహేశ్ బాబు.. ఈ న‌లుగురు క‌థానాయ‌కులకు 2019 ఫ‌స్టాఫ్‌ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలచిపోతుంది. ఎందుకంటే.. ఈ ప్రథమార్ధంలో ఆ యా హీరోలు నటించిన సినిమాలు వారి కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాసర్స్‌గా నిలిచాయి.

2019 ఫస్టాఫ్: ఆ నలుగురూ కెరీర్ బెస్ట్ సాధించారు!

ఆ డిటైల్స్‌ల్లోకి వెళితే.. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఎఫ్ 2’  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఈ ఇద్దరి హీరోల కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాసర్‌గా నిలచిపోయింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ‘మజిలీ’తో తన కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాసర్‌ను అందుకున్నాడు నాగచైతన్య.

2019 ఫస్టాఫ్: ఆ నలుగురూ కెరీర్ బెస్ట్ సాధించారు!

అలాగే వేస‌వి సంద‌ర్భంగానే మే నెలలో విడుద‌లైన ‘మహర్షి’తో మహేశ్ కూడా బాక్సాఫీస్ వద్ద క‌లెక్ష‌న్ల‌ సునామీని సృష్టించి.. కెరీర్ హ‌య్య‌స్ట్ గ్రాసర్‌ను సాధించాడు. మొత్త‌మ్మీద‌.. 2019 ప్రథమార్ధంలో వెంకీ, వ‌రుణ్‌, చైతూ, మ‌హేశ్  కెరీర్ హ‌య్య‌స్ట్ గ్రాసర్స్‌తో అద‌ర‌గొట్టార‌నే చెప్పాలి. మ‌రి ద్వితీయార్ధంలో ఈ ప‌రంప‌ర‌ని కొన‌సాగించే హీరోలు ఎవ‌ర‌వుతారో చూద్దాం.

2019 ఫస్టాఫ్: ఆ నలుగురూ కెరీర్ బెస్ట్ సాధించారు! | actioncutok.com

More for you: