నాలుగోస్సారి..!


నాలుగోస్సారి..!
Samantha and Vijay

నాలుగోస్సారి..!

స‌మంత‌.. ఈ త‌రంలో ఎక్కువ స‌క్సెస్ రేట్ చూసిన క‌థానాయిక‌. అంతేకాదు, ప‌లువురు హీరోల‌కు క‌లిసొచ్చిన వైనం కూడా ఈ టాలెంటెడ్ బ్యూటీ సొంతం. అందుకే.. సామ్‌తో మ‌ళ్ళీ మ‌ళ్ళీ క‌ల‌సి న‌టించేందుకు క‌థానాయ‌కులు ఆస‌క్తి చూపిస్తుంటారు. కాగా, స‌మంతతో ఇప్ప‌టివ‌ర‌కు ఎక్కువ సార్లు జోడీ క‌ట్టిన హీరోలుగా య‌న్టీఆర్‌, నాగ‌చైత‌న్య నిలిచారు.  ‘ఏమాయ చేసావె’, ‘మ‌నం’, ‘ఆటోన‌గ‌ర్ సూర్య‌’, ‘మ‌జిలీ’ చిత్రాల్లో చైతూ, సామ్ జంట‌గా న‌టించ‌గా.. ‘బృందావ‌నం’, ‘రామ‌య్యా వ‌స్తావ‌య్యా’, ‘ర‌భ‌స‌’, ‘జ‌న‌తా గ్యారేజ్‌’ వంటి సినిమాల్లో తార‌క్‌, సామ్ జోడీ క‌ట్టారు. 

ఇప్పుడు ఇదే వ‌రుస‌లో మ‌రో హీరో కూడా సమంతతో నాలుగోసారి న‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడ‌ట‌. అయితే, ఈ సారి న‌టిస్తున్న‌ది తెలుగు హీరో కాదు, కోలీవుడ్ స్టార్‌. అత‌డే.. విజ‌య్‌. ‘క‌త్తి’, ‘తెరి’, ‘మెర్స‌ల్‌’.. ఇలా మూడు సార్లు త‌న‌కు అచ్చొచ్చిన సామ్‌తో నాలుగోసారి జ‌ట్టుక‌ట్ట‌నున్నాడ‌ట విజ‌య్‌.  లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. 2020 వేస‌విలో ఈ త‌మిళ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని స‌మాచారం.

నాలుగోసారి న‌టించిన సంద‌ర్భంలో తార‌క్‌, చైతూకి వ‌ర్క‌వుట్ అయిన సామ్ ఫ్యాక్ట‌ర్‌.. విజ‌య్‌కి కూడా క‌లిసొస్తుందేమో చూడాలి మ‌రి.

నాలుగోస్సారి..! | actioncutok.com

More for you: