2019 సెకండాఫ్: హాఫ్ డ‌జ‌న్ స్టార్ మూవీస్‌

2019 సెకండాఫ్:  హాఫ్ డ‌జ‌న్ స్టార్ మూవీస్‌
Saaho

2019 సెకండాఫ్: హాఫ్ డ‌జ‌న్ స్టార్ మూవీస్‌

సాధార‌ణంగా అగ్ర క‌థానాయ‌కుల సినిమాలు రిలీజ‌య్యే రోజు థియేట‌ర్ల వ‌ద్ద పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ప్రతీ ఏడాది 10 నుంచి 20 వ‌ర‌కు టాప్ హీరోల సినిమాలు విడుద‌ల‌వుతుంటాయి. ఇక ఈ ఏడాది విష‌యానికి వ‌స్తే.. ఫ‌స్టాఫ్‌లో కేవ‌లం ఐదు చిత్రాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేశాయి. జ‌న‌వ‌రిలో ‘య‌న్టీఆర్ క‌థానాయ‌కుడు’ (బాల‌కృష్ణ‌), ‘విన‌య విధేయ రామ‌’ (రామ్ చ‌ర‌ణ్‌), ‘ఎఫ్ 2′(వెంక‌టేశ్‌) చిత్రాలు రిలీజ్ కాగా, ఫిబ్ర‌వ‌రిలో ‘య‌న్టీఆర్ మ‌హానాయ‌కుడు’ (బాల‌కృష్ణ‌), మేలో ‘మ‌హ‌ర్షి’ (మ‌హేశ్ బాబు) రిలీజ‌య్యాయి.

2019 సెకండాఫ్:  హాఫ్ డ‌జ‌న్ స్టార్ మూవీస్‌
Manmadhudu 2

అయితే, ద్వితీయార్ధంలో అటుఇటుగా ఇదే సంఖ్య‌లో లేదంటే అంత‌కుమించి అగ్ర తార‌ల చిత్రాలు తెర‌పైకి రానున్నాయి. వీటిలో ముందుగా రానున్న చిత్రం ‘సాహో’. ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న ఈ స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఆగ‌స్టు 15న రిలీజ్ కానుంది. ఇక అదే ఆగ‌స్టులో నాగార్జున ‘మ‌న్మ‌థుడు 2’ విడుద‌ల కానుందని స‌మాచారం. 

2019 సెకండాఫ్:  హాఫ్ డ‌జ‌న్ స్టార్ మూవీస్‌
Sye Raa

సెప్టెంబ‌ర్‌లో వెంక‌టేశ్ న‌టిస్తున్న ‘వెంకీ మామ‌’ ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా.. అక్టోబ‌ర్ 2న చిరంజీవి క‌ల‌ల ప్రాజెక్ట్‌ ‘సైరా న‌ర‌సింహారెడ్డి’ రాబోతోందని టాక్‌. ఇక అదే నెల‌లో ర‌వితేజ ‘డిస్కో రాజా’ థియేట‌ర్లలోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఇక అల్లు అర్జున్ కొత్త చిత్రం కూడా ఏడాది చివ‌ర‌లో రావచ్చ‌ని వినిపిస్తోంది.  మొత్తానికి.. 2019 సెకండాఫ్‌లో స్టార్ హీరోల సంద‌డి బాగానే ఉండొచ్చ‌న్న‌మాట‌.

2019 సెకండాఫ్:  హాఫ్ డ‌జ‌న్ స్టార్ మూవీస్‌
Venky Mama
2019 సెకండాఫ్:  హాఫ్ డ‌జ‌న్ స్టార్ మూవీస్‌
2019 సెకండాఫ్:  హాఫ్ డ‌జ‌న్ స్టార్ మూవీస్‌
AA19

2019 సెకండాఫ్: హాఫ్ డ‌జ‌న్ స్టార్ మూవీస్‌ | actioncutok.com

More for you: