ఆగస్టులో ఏడు!

ఆగస్టులో ఏడు!
ఆగస్టు 2019.. సినీ ప్రియులకు కనువిందైన వినోదాలకు వేదిక కానుంది. ఎందుకంటే.. ఆ నెలలో తెలుగు తెరపైకి ఏడు నోటబుల్ ప్రాజెక్ట్స్ తెరపైకి రాబోతున్నాయి. వీటిలో ఐదు స్ట్రయిట్ ఫిల్మ్స్ ఉండగా.. రెండు డబ్బింగ్ సినిమాలున్నాయి.
ఆ డిటైల్స్‌లోకి వెళితే, ఆగస్టు తొలి వారంలో అంటే ఆగస్టు 2న శర్వానంద్, కాజల్ జంటగా సుధీర్ వర్మ రూపొందిస్తున్న ‘రణరంగం’ విడుదల కానుండగా.. రెండో వారంలో అంటే ఆగస్టు 9న నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్లో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న’మన్మథుడు 2′ రాబోతోంది. ఇక అదే వారంలో ఆగస్టు 10న బాలీవుడ్ హిట్ ‘పింక్’కి రీమేక్‌గా తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘నేరకొండ పార్వై’ రిలీజ్ కానుంది. అజిత్, విద్యా బాలన్, శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం తెలుగులోనూ అనువాదం కానుందని టాక్.

ఇక మూడో వారంలో అంటే ఆగస్టు 15న ప్రభాస్ భారీ బడ్జెట్ మూవీ ‘సాహో’ రిలీజ్ కానుంది. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో అదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నాలుగో వారంలో అంటే ఆగస్టు 23న అడివి శేష్, రెజీనా జంటగా వెంకట్ రామ్‌జీ రూపొందిస్తున్న ‘ఎవరు?’ విడుదల కానుంది.
ఇక చివరి వారంలో అంటే ఆగస్టు 30న నాని, విక్రమ్ కుమార్ కాంబోలో వస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ రిలీజ్ కానుంది. ఇక అదే రోజున ‘వీడొక్కడే’, ‘బ్రదర్స్’ తరువాత సూర్య, కేవీ ఆనంద్ కలయికలో రానున్న ‘కాప్పాన్’ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
మరి.. ఈ ఏడు చిత్రాలలో వేటికి ప్రజాదరణ దక్కుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

ఆగస్టులో ఏడు! | actioncutok.com
More for you: