దారుణం: ట్రాక్టరుతో గుద్ది ఇద్దర్ని చంపేశాడు!


దారుణం: ట్రాక్టరుతో గుద్ది ఇద్దర్ని చంపేశాడు!

దారుణం: ట్రాక్టరుతో గుద్ది ఇద్దర్ని చంపేశాడు!

చిత్తూరు జిలా మదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఇద్దరు యువకులు కూలి పనికి రాకపోవడంతో యజమాని చంద్రా నాయక్ వాళ్లను ట్రాక్టర్‌తో గుద్ది చంపేశాడు. చంద్రా నాయక్ వద్ద కొంత కాలంగా హరిప్రసాద్, నాగభూషణం కూలి పని చేస్తున్నారు. నిందితుడు చంద్రా నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని రామానాయక్ తండాకు చెందిన చంద్రా నాయక్ ట్రాక్టరులో ఇసుక తోలుకుంటూ జీవిస్తున్నాడు. అతని వద్ద అక్కడి సమీప గ్రామానికి చెందిన హరిప్రసాద్, నాగభూషణం కూలీలుగా పనిచేస్తూ వచ్చారు. అనారోగ్యం వల్ల కూలీకి రాలేమనీ, తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వమనీ వాళ్లు చంద్రా నాయక్‌ను అడిగారు. డబ్బులు ఇస్తానని పిలిపించి, వాళ్లను కూలీపని చేయాల్సిందిగా నాయక్ ఆదేశించాడు.

కానీ వాళ్లు చెయ్యలేమని చెప్పి బైక్‌పై వెళ్తుండగా, వాళ్లను చంద్రా నాయక్ తన ట్రాక్టరుతో గుద్దాడు. తీవ్ర గాయాలై హరిప్రసాద్ అప్పటికప్పుడే మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న నాగభూషణం కూడా అంబులెన్స్ వచ్చే సమయానికి ప్రాణాలు వదిలాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు చంద్రా నాయక్‌పై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దారుణం: ట్రాక్టరుతో గుద్ది ఇద్దర్ని చంపేశాడు! | actioncutok.com

More for you: