‘అఖిల్ 4’కి ‘సిసింద్రీ’ సెంటిమెంట్‌?


'అఖిల్ 4'కి 'సిసింద్రీ' సెంటిమెంట్‌?
Akhil

‘అఖిల్ 4’కి ‘సిసింద్రీ’ సెంటిమెంట్‌?

ఊహ తెలియ‌ని వ‌య‌సులోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ని అందుకున్న ఘ‌న‌త అక్కినేని అఖిల్‌ది. బుడి బుడి అడుగుల ప్రాయంలోనే ‘సిసింద్రీ’ (1995)గా ఎంట‌ర్‌టైన్ చేసిన‌ అఖిల్‌.. ఆ సినిమా విడుద‌లైన స‌రిగ్గా 20 ఏళ్ళ త‌రువాత ‘అఖిల్‌’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే, తొలి అడుగే త‌ప్ప‌ట‌డుగు కావ‌డంతో… డిజాస్ట‌ర్ చ‌విచూడాల్సి వ‌చ్చింది. ఆ త‌రువాత ‘హ‌లో’, ‘మిస్ట‌ర్ మ‌జ్ను’తోనూ ఇదే ఫీట్ రిపీట్ అయ్యింది. ఈ నేప‌థ్యంలో.. క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న నాలుగో చిత్రంపైనే త‌న ఆశ‌లు పెట్టుకున్నాడు అఖిల్‌.

‘బొమ్మ‌రిల్లు’ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవ‌లే ప‌ట్టాలెక్కింది. కాగా, రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ థింగ్ వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. అఖిల్ ఫ‌స్ట్ ఆన్ స్క్రీన్ మామ్ ఆమ‌ని.. ఇందులోనూ అత‌నికి అమ్మ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ‘బొమ్మ‌రిల్లు’లోని జ‌య‌సుధ పాత్ర మాదిరిగానే ఇందులో ఆమ‌ని పోషిస్తున్న పాత్ర కూడా క‌థ‌లో చాలా కీల‌కంగా ఉంటుంద‌ని టాక్‌.

మ‌రి.. ‘సిసింద్రీ’ సెంటిమెంట్‌తో రానున్న కొత్త చిత్రంతోనైనా అఖిల్ స‌క్సెస్ ట్రాక్‌లో ప‌డ‌తాడ‌మో చూద్దాం.

‘అఖిల్ 4’కి ‘సిసింద్రీ’ సెంటిమెంట్‌? | actioncutok.com

More for you: