‘అ!’ డైరెక్ట‌ర్‌తో అఖిల్‌?


'అ!' డైరెక్ట‌ర్‌తో అఖిల్‌?

‘అ!’ డైరెక్ట‌ర్‌తో అఖిల్‌?

క‌థానాయ‌కుడిగా ఎంట్రీ ఇచ్చి నాలుగేళ్ళ‌వుతున్నా ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క విజ‌యాన్ని కూడా అందుకోలేక‌పోయాడు అక్కినేని యంగ్ హీరో అఖిల్‌.  ‘అఖిల్‌’, ‘హ‌లో’, ‘మిస్ట‌ర్ మ‌జ్ను’.. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు మూడు చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన అఖిల్.. ప్ర‌స్తుతం ‘బొమ్మ‌రిల్లు’ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్నాడు. ఇటీవ‌లే ప‌ట్టాలెక్కిన ఈ చిత్రం.. ఈ ఏడాది చివ‌రలో తెర‌పైకి రానుంది.

ఈ చిత్రం విడుద‌ల‌య్యేలోపే.. త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట అఖిల్‌. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ‘అ!’ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఈ సినిమా చేయ‌నున్నాడ‌ట అఖిల్‌. ఇప్ప‌టికే ప్ర‌శాంత్ చెప్పిన స్టోరీ లైన్ కి ఇంప్రెస్ అయిన అఖిల్‌.. ఈ సినిమా చేయ‌డానికి ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాడ‌ట‌. ఈ సంవ‌త్స‌రం ద్వితీయార్ధంలో ప‌ట్టాలెక్క‌నున్న ఈ మూవీ.. వ‌చ్చే ఏడాది వేస‌విలో రిలీజ్ అయ్యే అవ‌కాశ‌ముందని స‌మాచారం.

కాగా, ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘క‌ల్కి’ (రాజ‌శేఖ‌ర్‌), ‘ద‌టీజ్ మ‌హాలక్ష్మి’ (త‌మ‌న్నా) చిత్రాలు విడుద‌ల‌కు సిద్దంగా ఉన్నాయి.

'అ!' డైరెక్ట‌ర్‌తో అఖిల్‌?
Prasanth Varma

‘అ!’ డైరెక్ట‌ర్‌తో అఖిల్‌? | actioncutok.com

More for you: