అక్కినేని ఫ్యామిలీ కేరాఫ్ లిప్ లాక్స్‌!


అక్కినేని ఫ్యామిలీ కేరాఫ్ లిప్ లాక్స్‌!

అక్కినేని ఫ్యామిలీ కేరాఫ్ లిప్ లాక్స్‌!

“ఘ‌డియ ఘ‌డియ‌కో ముద్దు ఘ‌న‌మైన ముద్దు” అని పాడుకునే ప్రేమజంట‌కు.. ముద్దంటే  త‌మ ప్రేమను తెలియజేప్పే ఓ అందమైన సాధనం. ఇప్పుడంటే తెలుగునాట ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ ఎక్స్ 100’ వంటి చిత్రాలను లిప్ లాక్‌ల‌కు ఉదాహరణ చెబుతున్నారు గాని.. ఈ సినిమాల కంటే ముందే ఈ లిప్ లాక్‌ సన్నివేశాలకు ఆజ్యం పోసింది  మాత్రం అగ్ర కథానాయకుడు నాగార్జున అనే చెప్పాలి. ‘గీతాంజ‌లి’ నుంచి ‘మ‌న్మ‌థుడు 2’ వ‌ర‌కు గ‌త 30 ఏళ్ళుగా వెండితెర‌పై ‘ముద్దు’ల  ప్రియుడిగా కొన‌సాగుతున్నాడు ఈ అక్కినేని హీరో.  నాగ్ అనే కాదు, ఈ అధ‌ర చుంబ‌న సన్నివేశాలకు సంబంధించి అక్కినేని ఫ్యామిలీ ఓ అరుదైన ఘనతనే సొంతం చేసుకుంది.

ఆ డిటైల్స్‌లోకి వెళితే,  ‘గీతాంజలి’ (1989) చిత్రంలో  నాగ్, గిరిజ లిప్ లాక్ సాంగ్ “ఓం నమః” అప్పట్లో పెద్ద సంచలనం. గిరిజతో ప్రారంభమైన నాగ్‌ అధర చుంబన సన్నివేశాలు.. అమల, అయేషా ఝుల్కా, శోభన, ఇషా కొప్పికర్, రవీనా టాండన్, సుస్మితా సేన్, టబు, శిల్పా శెట్టి,  అనుష్క వరకు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.  తాజాగా ‘మన్మథుడు 2’లో కూడా ముద్దు సన్నివేశాల్లో నటించిన నాగ్ మరోసారి తన స్టైల్ ఆఫ్ లిప్ లాక్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి సిధ్ధ‌ప‌డుతున్నాడు.

ఇక ఆ ఫ్యామిలీలో నాగ్ తర్వాత చెప్పుకోవల్సింది సమంత గురించే.. పెళ్ళైనా కూడా అధర చుంబన సన్నివేశాల్లో నటిస్తూ ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది ఈ భామ. పెళ్ళికి ముందు విజయ్, ధనుష్, విక్రమ్ వంటి హీరోల‌తో లిప్ లాక్ చేసిన సామ్‌.. పెళ్ళి త‌ర్వాత రామ్ చరణ్‌తో   అధ‌ర చుంబ‌న స‌న్నివేశంలో న‌టించేసింది. ఇక, అవకాశం వచ్చినప్పుడల్లా భర్త చైతుతో కలసి లిప్ లాక్ చేయ‌డానికి ఎప్ప‌డూ సిద్ధంగా ఉండే సామ్‌.. తాజాగా ‘మజిలీ’లో చైతుపై తన ప్రేమను వెండితెర సాక్షిగా ముద్దుతో తెలియజేసింది.

ఇక చైతు కూడా పలు హీరోయిన్స్‌తో లిప్ లాక్ సీన్స్‌లో న‌టించేయ‌గా.. అదే బాట‌లో అఖిల్, సుమంత్, సుశాంత్ కూడా ఈ అధర చుంబన సన్నివేశాల్లో నటించారు, నటిస్తున్నారు.

మొత్తానికి అప్పట్లో “ముద్దంటే చేదా” అనే పాటలో ఏఎన్నార్ నటించగా.. “ముద్దంటే మోజే” అని ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ అంతా ఈ అధ‌ర చుంబన స‌న్నివేశాల్లో నటించేస్తూ ఓ అరుదైన ఘ‌న‌త‌నే త‌మ సొంతం చేసుకుంద‌ని చెప్పొచ్చు. 

అక్కినేని ఫ్యామిలీ కేరాఫ్ లిప్ లాక్స్‌!   | actioncutok.com

More for you: