ఇక బ‌న్నీ ఫుల్ బిజీ..


ఇక బ‌న్నీ ఫుల్ బిజీ..
Allu Arjun

ఇక బ‌న్నీ ఫుల్ బిజీ..

‘నా పేరు సూర్య‌’ త‌రువాత భారీ విరామ‌మే తీసుకున్న అల్లు అర్జున్‌.. తాజాగా మూడు చిత్రాల‌కు క‌మిట్ అయ్యాడు. త్రివిక్ర‌మ్‌, సుకుమార్‌, వేణు శ్రీ‌రామ్.. ఇలా స‌క్సెస్ ట్రాక్‌లో ఉన్న ముగ్గురు ద‌ర్శ‌కుల‌తో ఈ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు బ‌న్నీ.  వీటిలో ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ చిత్రం మొద‌లైంది. అంతేకాదు.. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా… వ‌చ్చే వారం నుంచి నెక్ట్స్ షెడ్యూల్ జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం.   ఈ షెడ్యూల్ నుంచే బ‌న్నీ  కూడా షూటింగ్‌లో పాల్గొననున్నాడ‌ని తెలిసింది. 

అలాగే.. సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని  ఫినిష్ చేయాలని బన్నీ భావిస్తుండడంతో… నాన్‌స్టాప్ షూటింగ్ కోసం కసరత్తులు కూడా ప్రారంభించిందంట‌ చిత్ర బృందం. కాగా.. తన సినిమాల్లో పాత్రల తీరుతెన్నుల‌తో పాటు లుక్స్‌కి కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చే బన్నీ.. ఈ చిత్రంలో కూడా మంచి ఫిట్‌నెస్‌తో పాటు   కొత్త త‌ర‌హా హెయిర్ స్టైల్‌తో దర్శనమివ్వనున్నట్టు సమాచారం.  మొత్తానికి.. గ‌త కొన్నాళ్లుగా మేక‌ప్‌కి దూరంగా ఉన్న బ‌న్నీ… ఇక షూటింగ్‌ల‌తో, వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీ కానున్నాడ‌న్న‌మాట‌.

‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబోలో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. 2020 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవ‌కాశ‌ముంది.

ఇక బ‌న్నీ ఫుల్ బిజీ.. | actioncutok.com

More for you: